జోరుగా ఎన్నికల ప్రచారం…

జోరుగా ఎన్నికల ప్రచారం…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఝరాసంగం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డమీద లక్ష్మమ్మ చంద్రయ్య అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, సర్పంచ్ ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల..”ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల”..

స్థానిక సంస్థల..”ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల”..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్ కల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ రోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ఐకెపి (ఇందిరా క్రాంతి పథకం) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఈ నెల 5 వరకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి అవకాశం..!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version