జహీరాబాద్లో నిమ్స్ జోష్…

జహీరాబాద్లో నిమ్స్ జోష్

◆:- అందరి దృష్టి జహీరాబాద్ వైపు

◆:–ఇది వరకే వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు

◆:- దేశం నలుమూలల నుంచి పెట్టుబడులు

◆:- తారుస్థాయికి చేరుతున్న రియల్ ఎస్టేట్

◆:- అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు

ఒకప్పుడు నిమ్ ప్రాజెక్ట్ గురించి కలలు కన్న జహీరాబాద్ ఇప్పుడు నిజమవుతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్స్) మొదటి దశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇది కేవలం భూముల వ్యాపారానికే పరిమితం కాకుండా, ఇళ్లు, ప్లాట్ల డిమాండ్ ను కూడా భారీగా పెంచుతోంది. ఆలస్యమైనా సరైన సమయంలో ఇవ్వడంతో పుష్కరకాల నిరీక్షణకు తెరపడింది. నెలరోజుల్లో లేఔట్ పనులు ప్రారంభం కానున్నాయన్న సమాచారం వ్యాపారాలు, రైతులు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపింది. అందరి దృష్టి ఇప్పుడు జహీరాబాద్ పై పడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్: ఒకప్పుడు నిమ్స్ ప్రాజెక్ట్ గురించి కలలు కన్న జహీరాబాద్ కట ఇప్పుడు నిజమవుతోంది. దశాబ్దా లుగా ఎదురు చూస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్స్) మొదటి దశకు ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టే ట్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇది కేవలం భూముల వ్యాపారానికే పరిమితం కాకుండా, ఇళ్లు, ప్లాట్ల డిమాండ్ ను కూడా భారీగా పెంచుతోంది. ఆలస్యమైనా సరైన సమయంలో ప్రభుత్వం నిమ్స్ ఫస్ట్ ఫేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పుష్కరకాల నిరీక్షణకు తెర పడింది. నెలరోజుల్లో లేఔట్ పనులు ప్రారంభం కానున్నాయన్న సమాచారం వ్యాపారాలు, రైతులు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపింది. పదేళ్ల కాలపరిమితితో 2012లో మొదలైన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్స్) కల, పుష్కరం పాటు కలగానే ఉండిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు, భూముల
ధరల పెరుగుదల … తదితర అంశాలు ఒకప్పుడు కేవలం చర్చలకే పరిమితమయ్యాయి, కానీ, ఇప్పుడు ఆ నిరీక్షణకు తెర పడింది. నిమ్స్ ప్రాజెక్ట్ మొదటి దశకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అందర్ దృష్టి ఇప్పుడు జహీరాబాద్ పై పడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది.

పుంజుకున్న రియల్ వ్యాపారం..

 

 

 

కొంతకాలంగా మందగించిన భూముల వ్యాపా రం ఒక్కసారిగా వేగం పంజుకుంది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ముఖ్యంగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడిదా రులు, మళ్ళీ ఆహీరాబాద్ వైపు దృష్టి సారించారు. నిమ్ మొదటి దశ అభివృద్ధి పనులకు నవంబర్ నెలలో లేఔట్ పనులు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటిం చదంతో, భూముల ధరలు అమాంతం పెరిగాయి. జాతీయ రహదారుల పొడవునా ఉన్న భూముల ధరలు ఏకంగా వికరం రూ.4 కోట్లు దాటగా, ఇతర రహదారు. లపై కూడా రూ. కోటి కంటే ఎక్కువగా పలకుతున్నాయి. నిమ్డ్ ప్రాజెక్ట్ మొత్తం 12.635 ఎకరాల్లో విస్తరించనుం డగా మొదటి దశలో 3.245 ఎకరాలకు అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2369 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ పురోగతి వ్యాపారులకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది.

దేశం నలుమూలల నుంచి పెట్టుబడులు..

 

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపడంతో, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబదులు జహీరాబాద్ కు తరలివచ్చు అవకాశం ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు: మొదలైతే, దానికి అనుబంధంగా ఇతర పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనికి తోడు విమా నాశ్రయాలు అదనపు ఆకర్షణలున్నాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 125. కిలోమీటర్లు, కర్ణాటక రాష్ట్రం బీదర్ విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెట్టుబడల ఆకర్షలు. ఆర్థిక కార్యకలాపాలు సవ్యంగా జరిగేందుకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాయి. నిమ్స్ మొదటి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో, కేవలం స్థానికులే కాకుండా దేశం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు. జహీరాబాద్ వైపు చూస్తున్నారు. భారీ పరిశ్రమలు. మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు మొదలైతే వేలాది ఉద్యోగాలు వస్తాయి. దీంతో నివాస ప్రాంతాల అవసరం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే, చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు భూములతో పాటు ఇళ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే అనేక కొత్త వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఈ ప్రాంతం రూపురేఖలను పూర్తిగా మార్చేసేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.

భవిష్యత్తు వైపు చూపు..

నిమ్స్ ప్రాజెక్ట్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపాదాన్ని మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. కొత్త పరిశ్రమలు, ఉపాది అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు జహీరాబాద్ ను ఒక కీలకమైన పారిశ్రామిక కేంద్రంగా మారు స్తాయి. ఎంతోకాలంగా నిరీక్షించిన ఈ శుభవార్తతో. జహీరాబాద్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. భూముల వ్యాపారం మళ్లఈ జోరందుకోవడమే కాకుండా, ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి ఇదో మైలు: రాయిగా నిలుస్తోంది,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version