న్యాల్కల్ దర్గా ఉర్సు షరీఫ్: జనవరి 30 నుండి ఫిబ్రవరి 6 వరకు ఏర్పాట్లు జోరు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో హజ్రత్ పీర్ గైబ్ సాహెబ్ దర్గా 359వ ఉర్సు షరీఫ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు నిర్వహించనున్నట్లు ఉర్సు కమిటీ తెలిపింది.
ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లు, విద్యుత్ లైటింగ్, తాగునీటి సౌకర్యాలు, ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతిభద్రతల చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ ఉత్సవాలకు న్యాల్కల్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
