సైబర్ క్రైమ్ మరియు సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలి
-బాల బాలికలకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి మల్లేశ్వరి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐసీడీఎస్ మొగుళ్లపల్లి సెక్టార్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బాల బాలికలకు సైబర్ క్రైమ్ మరియు సోషల్ మీడియాపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి మల్లేశ్వరి బాల బాలికలకు తగిన సూచనలు చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని, స్కిల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను అభ్యసించాలన్నారు. తల్లిదండ్రులు మరియు పుట్టిన ఊరు గర్వపడేలా మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జాలీ సునితా రెడ్డి, ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్, ఎస్ఐ ముప్పు సురేష్, ఏపీఎం రమాదేవి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవత, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి, సఖి కౌన్సిలర్ మాధవి, అనూష, మమత, కళావతి, మొగుళ్ళపల్లి సెక్టార్ అంగన్వాడీ టీచర్లు బత్తిని స్వప్న, మోటే రజిత, ఎల్దండి వెన్నెల, తక్కల్లపల్లి అశ్విని, చెవ్వ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
