స్వశక్తి నారి అభియాన్ వైద్య శిబిరము…

స్వశక్తి నారి అభియాన్ వైద్య శిబిరము

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లాలో ఆరోగ్య మహిళ ఆరోగ్యవంతమైన కుటుంబము స్వశక్తి నారి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మందమర్రిలో ప్రత్యేక వైద్య శిబిరమును డాక్టర్ సుధాకర్ నాయక్ ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేసినారు ఈ వైద్య శిబిరంలో 172 మంది నమోదు చేసుకున్నారు ఈ శిబిరంలో డాక్టర్ అతుల్ ఫిజీషియన్ డాక్టర్ శిల్ప కంటి వైద్య నిపుణులు డాక్టర్ మానస స్త్రీ వైద్య నిపుణులు ఎమ్మెల్యే సీలు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది

ఈ ప్రత్యేక వైద్య శిబిరములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ అనిత ఆధ్వర్యంలో చేస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య నిపుణుల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చేపట్టడం రోగుల వివరములను ఆన్లైన్లో నమోదు చేయడం అదేవిధంగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా పరీక్షలు చేయించడం మందులను చికిత్సలు అందించడము రిఫరల్ కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగినది ముఖ్యంగా ఈ ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా మాతా శిశు సంరక్షణ టీకాల కార్యక్రమము అసంక్రమణ వ్యాధులు బిపి డయాబెటిస్ క్యాన్సర్ల నిర్ధారణ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలు కీటక జనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటివి పరబలకుండా చర్యలు చేపట్టడం అవగాహన కలిగించడం జరిగినది ముఖ్యంగా పిల్లలకు టీ తాగిపించడం సరైన సమయంలో సరైన వయసులో ఇవ్వడం టీవీ ద్వారా రోగులను గుర్తించి వారికి పోషకాహార కిట్టులు అందజేయడం జరుగుతుందని అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మానస సిబ్బంది శ్రీ సత్తయ్య సి హెచ్ ఓ బుట్ట వెంకటేశ్వర్ జిల్లా మాస్ మియాధికారి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version