“తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తులు రేపటి నుంచి..

రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు *రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు.. అప్లికేషన్స్ కు అనర్హులు వీరే

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త మద్యం (New Liquor Shops) దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాబోతోంది. రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతుల కోసం ఇప్పటికే ఎక్సెజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నోటిఫికేషన్ కు అనుబంధంగా ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధరించారు. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తారు. ఎక్సెజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు మద్యం దుకాణాలు పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. దుకాణాల కేటాయింపుల్లో గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈమేరకు రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి జతచేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్లు ఈ ఏడాది నవంబర్ చివర వరకు గడువు ఉంది.

బార్లలో బీర్ల తయారీ లైసెన్స్ కు నేడే ఆఖరు తేదీ:

హోటల్ లేదా రెస్టారెంట్లలోనే బీర్లు తయారు చేసి విక్రయిచేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ లైసెన్స్లు జారీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన లైసెన్స్ కోసం దరఖాస్తులకు ఇవాల్టితో ఆఖరు గడువు ముగియనుంది. 2బి బార్లు, ఎలైట్ బార్లు, సీ1- క్లబ్, టిడి1, టీడీ2 లాంటి లైసెన్స్ కలిగిన హోటల్, రెస్టారెంట్లలో మైక్రో బ్రూవరీ యూనిట్లు ఏర్పాటు కోసం రూ. 1 లక్ష రుసుముతో దరఖాస్తులను అబ్కారీ శాఖ ఆహ్వానించింది.ఈ దరఖాస్తులకు ఇవాల్టితో గడువు పూర్తి ముగియనుంది. tgbcl.telangana.gov.in వెబ్ సెట్ ను సందర్శించాలని సూచించింది. వివరాలకుదరఖాస్తులు.. అప్లికేషన్స్ కు అనర్హులు వీరే*

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త మద్యం (New Liquor Shops) దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాబోతోంది. రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతుల కోసం ఇప్పటికే ఎక్సెజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నోటిఫికేషన్ కు అనుబంధంగా ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధరించారు. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తారు. ఎక్సెజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు మద్యం దుకాణాలు పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. దుకాణాల కేటాయింపుల్లో గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈమేరకు రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి జతచేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్లు ఈ ఏడాది నవంబర్ చివర వరకు గడువు ఉంది.

బార్లలో బీర్ల తయారీ లైసెన్స్ కు నేడే ఆఖరు తేదీ:

హోటల్ లేదా రెస్టారెంట్లలోనే బీర్లు తయారు చేసి విక్రయిచేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ లైసెన్స్లు జారీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన లైసెన్స్ కోసం దరఖాస్తులకు ఇవాల్టితో ఆఖరు గడువు ముగియనుంది. 2బి బార్లు, ఎలైట్ బార్లు, సీ1- క్లబ్, టిడి1, టీడీ2 లాంటి లైసెన్స్ కలిగిన హోటల్, రెస్టారెంట్లలో మైక్రో బ్రూవరీ యూనిట్లు ఏర్పాటు కోసం రూ. 1 లక్ష రుసుముతో దరఖాస్తులను అబ్కారీ శాఖ ఆహ్వానించింది.ఈ దరఖాస్తులకు ఇవాల్టితో గడువు పూర్తి ముగియనుంది. tgbcl.telangana.gov.in వెబ్ సెట్ ను సందర్శించాలని సూచించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version