manasthapamtho yuvakudu athmahatya, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సమ్మెట ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వారంరోజుల క్రితం వెలువడిన కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందినట్లు తెలిసింది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిన సమ్మెట ప్రవీణ్ వర్ధన్నపేట శివారు గంగాదేవి మాటు వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.