మహిపాల్ స్టోన్ క్రషర్ మీద చర్యలు తీసుకోవాలి
పరకాల ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సీపీఎం నాయకులు
పరకాల,నేటిధాత్రి
నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన మైపాల్ క్రషర్ పైన చర్యలు తీసుకురావాలని సిపిఎం నాయకులు ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సీపీఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలోని వివిధ వార్డుల
ఇందిరమ్మ లబ్ధిదారులకు కంకర అవసరనిమిత్తం కొన్ని క్రషర్ లను కేటాయించారని ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రొసిడింగ్ లెటర్ పట్టుకొని కంకెర కోసం వెళితే క్రషర్ వద్ద పనిచేసే వ్యక్తులు ఇందిరమ్మ లబ్ధిదారులకు మాకు ఇలాంటి సంబంధం లేదనడం పై కళ్యాణ్ మండిపడ్డారు.అధికారులు కేటాయించిన జాభితాలో వివిధ క్రషర్లతో పాటు మైపాల్ క్రషర్ కూడా లిస్టులో ఉన్న కూడా నేను పోయెను అని అక్కడి వ్యక్తులు చెప్పడం సరికాదన్నారు.ప్రభుత్వాన్ని అధికారులను మోసం చేస్తూ 800 టన్నుకు అమ్ముకుంటున్నారని అన్నారు.ప్రభుత్వాన్ని ప్రజలను మోసంచేస్తూ డబ్బును దండుకుంటున్న క్రషర్ యాజమాన్యం మీద
స్థానిక ఎమ్మెల్యే,అధికారులు
స్పందించి ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
