కౌటాలలో పులి అడుగులు గుర్తింపు
ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండంలో పులి అడుగులను గుర్తించారు. ఈ గ్రామం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దులో ఉంది. అయితే… ఈ సరిహద్దులో దట్టమైన అడవితోనాటు వార్ద నది కూడా ఉంది. కాగా… నది ఒడ్డున పులి పాదముద్రలను గుర్తించారు. దీంతొ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
కౌటాల(ఆదిలాబాద్): తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని వార్దా నదిలో శుక్రవారం పులి అడుగులను స్థానికులు గుర్తించారు. మండలంలోని తాటిపల్లి(Thatipalli) గ్రామ సమీపంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా థరూర్ గ్రామ సమీపంలోని వార్ద నదిలో పులి అడుగులను స్థానికులు గుర్తించి మహారాష్ట్ర అటవీ అధికారులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర అటవీ అధికారులు పులి అడుగులను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు.
పులి(Tiger) అడుగులు వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో స్పందించి కౌటాల సెక్షస్ అటవీ అధికారులు తులసీరాం, శ్రీదేవిలు వార్దా నది పరిసరాలను పరిశీలించారు. తెలంగాణ వైపు పులి అడుగులు లేనప్పటికీ ప్రజలను అప్రమత్తం చేశారు. తాటిపల్లి గ్రామంలో చాటింపు వేయించారు.రైతుల చేన్లలో వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పులి అనవాళ్లు కనిపించినట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు.
