మంచిర్యాల జిల్లా ఆటో & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

మంచిర్యాల జిల్లా ఆటో & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ( హెచ్ ఎం ఎస్ ) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.
రియాజ్ అహ్మద్ సూచనల మేరకు జిల్లాలో ట్రేడ్ యూనియన్‌ను బలోపేతం చేసే దిశగా సమావేశం నిర్వహించగా, యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నుకున్న నాయకులు:
నరెడ్ల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు,
తగరం శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీ,
ఎండి షఫీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,
దుడ రాజన్న జిల్లా ఉపాధ్యక్షులు,
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం జరుగుతోందని విమర్శిస్తూ,వెంటనే ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ఆటో కార్మికులంతా ఐక్యంగా ఉండి హెచ్ఎంఎస్ సభ నాయకత్వంలో తమ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ ఆటో యూనియన్ నాయకులు బూడిది రమేష్, రాజరెడ్డి,రమేష్,మహేష్,తాజ్ బాబా,అజీముద్దీన్,పల్లపు శ్రీనివాస్,అలీ,సురేష్,క్రాంతి కుమార్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

భూపాలపల్లి నేటిధాత్రి

 

విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 10 రోజులుగా టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరవధిక సమ్మె విజయవంతంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత, క్రమశిక్షణ ప్రశంసనీయం.
జేఏసీ రాష్ట్ర నాయకులు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని కలసి కార్మికుల 6 ప్రధాన డిమాండ్లను వివరించారు.
డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందిస్తూ, వెంటనే సమ్మెను విరమించి ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో చర్చలు జరపాలని సూచించారు. అదే సమయంలో సీఎండీ కూడా కార్మికులతో చర్చలు నిర్వహించాలని ఆదేశించారు. జేఏసీ నాయకులు సమ్మెను విరమించి సచివాలయంలో ట్రాన్స్కో సీఎండీ ని కలిశారు. సీఎండీ కార్మికుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, ఫైనాన్షియల్ భారంలేని అంశాలపై ఈరోజే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, ఎటువంటి అండర్‌టేకింగ్ లేకుండా కార్మికులు డ్యూటీలో చేరాలని డైరెక్టర్ హెచ్.ఆర్.డి సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.
కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ఆర్టిసన్, అన్‌మ్యాండ్ పీస్ రేట్ కార్మికులు వెంటనే డ్యూటీలో చేరాలని జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది.
మనమందరం ఐక్యంగా, శాంతియుతంగా పోరాడి ఒక ముఖ్య దశకు చేరుకున్నాము. డిమాండ్లపై సానుకూల స్పందన రావడం ద్వారా కార్మికులకు పాక్షిక విజయం లభించింది.
ఎవరూ అధైర్యపడవద్దు. మన సమస్యలు న్యాయబద్ధమైనవే కావడంతో త్వరలోనే పూర్తి పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 22,000 మంది ఆర్టిసన్, అన్‌మ్యాండ్ మరియు పీస్ రేట్ కార్మికులందరికీ జేఏసీ తరఫున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి కన్వీనర్లు మోత్కూరి కోటి తిప్పారపు రాజు ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ యాళ్ల సురేందర్ ఒంటేరు మల్లయ్య అంకుషావలి తదితరులు పాల్గొన్నారు

ఆర్టిజన్ వర్కర్స్ పై బెదిరింపులు మానుకోవాలి ఐఎఫ్టీయు….

ఆర్టిజన్ వర్కర్స్ పై బెదిరింపులు మానుకోవాలి ఐఎఫ్టీయు

శ్రీరాంపూర్ : నేటిధాత్రి

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు చర్యలు మానుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) రాష్ట్ర నాయకులు డి బ్రహ్మానందం అన్నారు. గురువారం శ్రీరాంపూర్ లోని జిఎల్బికేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో అత్యవసర విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికుల సుమారు 20వేల మంది నిరవధిక సమ్మెలోకి వెళ్లారని పేర్కొన్నారు. విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్ విద్యుత్ కార్మికులను టర్మిడెంట్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు.విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారని వివరించారు. విద్య అర్హతలు ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈసి రూల్స్ వర్తింపచేసి అమలు చేయాలని, టీజీ ఎన్సీడీసీఎల్ ను టీజీ ఎస్పీడీసీఎల్ లలో విలీనం చేయాలని అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 2016. డిసెంబర్ 4 ముందు ఉండే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని 2016 పి అర్సిని అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఈ సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా మొండి వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క ఆర్టిజన్ కార్మికుల పట్ల మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే ఈ సమ్మెకు కారణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు తమ విధానాలను మానుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మెకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్టియు) సంపూర్ణ మద్దతిస్తుందని తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆర్టిజన్ విద్యుత్ కార్మికులు ఇదే పట్టుదలతో మొక్కబోని ధైర్యంతో సమ్మెను కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఐఎఫ్టియు జిల్లా నాయకులు శంకరి సత్యం, కొదురుపాక సదానందం, జగన్నాథ్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version