మంచిర్యాల జిల్లా ఆటో & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ( హెచ్ ఎం ఎస్ ) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.
రియాజ్ అహ్మద్ సూచనల మేరకు జిల్లాలో ట్రేడ్ యూనియన్ను బలోపేతం చేసే దిశగా సమావేశం నిర్వహించగా, యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నుకున్న నాయకులు:
నరెడ్ల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు,
తగరం శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీ,
ఎండి షఫీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,
దుడ రాజన్న జిల్లా ఉపాధ్యక్షులు,
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, యూనియన్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం జరుగుతోందని విమర్శిస్తూ,వెంటనే ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ఆటో కార్మికులంతా ఐక్యంగా ఉండి హెచ్ఎంఎస్ సభ నాయకత్వంలో తమ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఆటో యూనియన్ నాయకులు బూడిది రమేష్, రాజరెడ్డి,రమేష్,మహేష్,తాజ్ బాబా,అజీముద్దీన్,పల్లపు శ్రీనివాస్,అలీ,సురేష్,క్రాంతి కుమార్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.
