విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
భూపాలపల్లి నేటిధాత్రి
విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 10 రోజులుగా టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరవధిక సమ్మె విజయవంతంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత, క్రమశిక్షణ ప్రశంసనీయం.
జేఏసీ రాష్ట్ర నాయకులు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని కలసి కార్మికుల 6 ప్రధాన డిమాండ్లను వివరించారు.
డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందిస్తూ, వెంటనే సమ్మెను విరమించి ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో చర్చలు జరపాలని సూచించారు. అదే సమయంలో సీఎండీ కూడా కార్మికులతో చర్చలు నిర్వహించాలని ఆదేశించారు. జేఏసీ నాయకులు సమ్మెను విరమించి సచివాలయంలో ట్రాన్స్కో సీఎండీ ని కలిశారు. సీఎండీ కార్మికుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, ఫైనాన్షియల్ భారంలేని అంశాలపై ఈరోజే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, ఎటువంటి అండర్‌టేకింగ్ లేకుండా కార్మికులు డ్యూటీలో చేరాలని డైరెక్టర్ హెచ్.ఆర్.డి సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.
కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ఆర్టిసన్, అన్‌మ్యాండ్ పీస్ రేట్ కార్మికులు వెంటనే డ్యూటీలో చేరాలని జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది.
మనమందరం ఐక్యంగా, శాంతియుతంగా పోరాడి ఒక ముఖ్య దశకు చేరుకున్నాము. డిమాండ్లపై సానుకూల స్పందన రావడం ద్వారా కార్మికులకు పాక్షిక విజయం లభించింది.
ఎవరూ అధైర్యపడవద్దు. మన సమస్యలు న్యాయబద్ధమైనవే కావడంతో త్వరలోనే పూర్తి పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 22,000 మంది ఆర్టిసన్, అన్‌మ్యాండ్ మరియు పీస్ రేట్ కార్మికులందరికీ జేఏసీ తరఫున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి కన్వీనర్లు మోత్కూరి కోటి తిప్పారపు రాజు ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ యాళ్ల సురేందర్ ఒంటేరు మల్లయ్య అంకుషావలి తదితరులు పాల్గొన్నారు
