
సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల.
సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధా, అనిల్ కుమార్ లు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో శివ రుద్రప్ప హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర పాల్గొన్నారు.