మొక్కలే మానవ మనుగడకు మూలం

మొక్కలే మానవ మనుగడకు మూలం= జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్..

*ప్రాణ యోగ ఆశ్రమంలో వృక్షారోపణ 2025 కార్యక్రమం ప్రారంభం..

రామచంద్రపురం(నేటి ధాత్రి)

మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం రామచంద్రపురం మండలం, కుప్పం బాదురు సమీపంలోని ప్రాణ యోగ ఆశ్రమంలో వృక్షారోపణ –2025 కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన ప్రాణ యోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ,, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చున్నారు. అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం ఆధ్వర్యంలో రావి, మర్రి చెట్ల నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ప్రజల ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షనీయమన్నారు.ప్రాణ యోగ ఆశ్రమ కైలాష్ గురూజీ మాట్లాడుతూ “వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమే. ఆధ్యాత్మికత చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుంది, దీనివలన భూమికే కాదు, జీవాత్మకూ మహోన్నతమైన ఉపయోగం కాగలదు,

 

 

 

 

 

అని పేర్కొన్నారు. వృక్షారోపణ 2025 అనేటువంటి కార్యక్రమం ప్రకృతి పరిరక్షణతో పాటు, ఆధ్యాత్మికతను సమాజంలో బలపరిచే శుభారంభమన్నారు.ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందికి యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక దైవచింతలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషమన్నారు.
అనంతరం ప్రాణ యోగ ఆశ్రమంలో పరిశుభ్రత పచ్చదనాన్ని భక్తుల వసతి భవనాలు, గోశాలలను పరిశీలించారు. ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను దుస్యాలువాతో సన్మానించి, జ్ఞాపకం అందజేశారు. ఈ వృక్షారోపణ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ కే ఎన్ సత్యనారాయణ,ఐఆర్ఎస్ అధికారిణి పాయల్ గుప్తా, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణరాజు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పి. రాజేంద్ర ప్రసాద్, రాయుడు. ఎంపీడీవో ఇందిరమ్మ, ఏపీవో సుజాత, వ్యవసాయ శాఖ అధికారిణి మమత, వీఆర్వో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version