
వడ దెబ్బతో వ్యవసాయ కూలీ మృతి..
వడ దెబ్బతో వ్యవసాయ కూలీ మృతి పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం సీతారాంపురంకు చెందిన కుసుంబ మోతే రావు రోజువారి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.రోజువారి లాగే ఏప్రిల్ 8న కూలి పనికి వెళ్తూ వడదెబ్బ తాకడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.కుటుంబ యజమాని మరణించడంతో శోకసముద్రంలో మునిగిపోయారు.మోతే రావుకు భార్య కుమారుడు కూతురు ఉన్నారు.