gananga ramjan vedukalu, ఘనంగా రంజాన్ వేడుకలు
ఘనంగా రంజాన్ వేడుకలు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలకేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం మండలకేంద్రంలోని స్థానిక గెస్ట్‌హౌజ్‌లో ముస్లీంలు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో అధికసంఖ్యలో ముస్లీంలు పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు అలాయ్‌బలాయ్ చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.