ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ సందర్భంగా.

ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ సందర్భంగా మెరుగైన పరిశుభ్రత సేవల

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కోహిర్ మండల జమాతే ఇస్లామీ హింద్ కోహీర్.
ఆధ్వర్యంలో మున్సిపాల్ కమిషనర్ ను ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ
ఒక లేఖ పత్రాన్ని సమర్పిస్తూ రేపు రాబోయే ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ సందర్భంగా మెరుగైన పరిశుభ్రత సేవలను నిర్ధారించడం గురించి మా ఆందోళనను తెలియజేయడానికి మేము వ్రాస్తున్నాము. బక్రీద్ అనేది 3 ప్రధాన మతపరమైన వేడుకల రోజులలో జరుపుకుంటుంమని. 7 జూన్ నుండి 9 జూన్ 2025 వరకు ఈ పండుగ రోజున ముస్లింలు ప్రవక్త ఇబ్రహీం (అ) సున్నత్‌ను అనుసరించి మత విశ్వాసంలో భాగంగా ఆచారబద్ధమైన జంతులను బలి ఇస్తారు.ఈ 3 రోజుల పండుగ పెద్ద బలి, ఇది చుట్టుపక్కల అవాంఛిత వ్యర్థాలను పెంచుతుంది.
కాబట్టి ఇళ్ల నుండి వ్యర్థాలను సేకరించి, జనసాంద్రత ఉన్న ప్రాంతానికి దూరంగా నియమించబడిన ప్రదేశానికి పారవేయడం ద్వారా శుభ్రమైన మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.కోహిర్ పౌరులకు పెద్ద డిస్పోజల్ బ్యాగులను అందించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము,తద్వారా వారు వ్యర్థాలను సంచిలో వేయవచ్చు మరియు తరువాత దానిని మున్సిపల్ కార్మికులు సేకరించవచ్చు. దీని ద్వారా కోహిర్ పరిశుభ్రమైన మరియు పరిశుభ్రమైన నగరంగా ఉండేలా మేము నిర్ధారించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలి.

సిరిసిల్ల జిల్లా చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డ్ లను పరిశీలించి,చెక్ పోస్ట్ లో గల సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగినది.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవడం జరిగిందని, గోవుల అక్రమ రవాణా గోవధ నివారించేందుకు జిల్లా సరిహద్దుల జిల్లెళ్ల, పెద్దమ్మ, మానాల క్రాస్ రాడ్ వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,తనిఖీల్లో సరైన పత్రాలు ఉన్న రైతులకు సంబంధించిన లేదా వ్యవసాయనికి సంబంధించిన పశువుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది విధులు నిర్వహిచాలని తెలియజేశారు. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ యంత్రాంగామంతా సమన్వయముతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్.ఐ శంకర్ నాయక్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

బక్రీద్ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని డి. ఎస్.పి సైదా అన్నారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగను సోదర భావంతో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలనరు సమావేశంలో హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా,విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు కుల,మతాలకు అతీతంగా పండగలను జరుపుకోవాలని చెప్పారు.సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలకు రూ.50 వేలు తన వంతు కర్తవ్యంగా ఇచ్చిన పారిశ్రామిక వేత్త కె.ప్రసాద్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ మండలంలో దిగ్వాల్ గ్రామంలో పారిశ్రామిక వేత్త జహీరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు కె.ప్రసాద్ రెడ్డి ఈరోజు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ పిలుపు మేరకు ఆలయం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.ఈ నేల 31,జూన్ 1,2,తేదీలో జరిగే మైసమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్బంగా రూ. 50 వేల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే కోహీర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ లో వున్న బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఏకమయ్యి ఏలాలని అన్నారు.కావున రాబోయే ఎన్నికల్లో యువ కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర కులాల పార్టీ కాదని అనగారని కులాల పార్టీ అని గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం.!

దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందడి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:

తొర్రూర్ డివిజన్ పరిధిలోని టీక్యా తండా , ఎర్రసోమ్లా తండా లో మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో బిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు.
గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎంతో ఉత్సాహంగా, సాంప్రదాయమైన పద్ధతులల్లో జరుపుకొనే ఈలాంటి పండుగలు మనుషుల మధ్య మానవ సంబంధాన్ని, ఆచార సాంప్రదాయాన్ని ప్రేమను పంచే విలువైన పండుగలుగా వర్ణించారు. గిరిజన మిత్రుడు శంకర్ నివాసంలో పండుగ సంబరాలు పాల్గొనడం ఎంతో ఆనందంగా అందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ తోరూర్ మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పిటిసి & మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళ పెల్లి శ్రీనివాస్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలవాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ , మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్స్ ఎన్నమ నేని శ్రీనివాసరావు, నాయకులు కర్నే నాగరాజు, పేర్ల జంపా సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ రాజు , మాజీ సర్పంచ్ విజయకుమార్ నాయకులు, గుంజి రవి యాకూబ్, బానోత్ అశోక్ తండావాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

2వ రోజు ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం .!

ఘనంగా 2వ రోజు ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు గల నూతన ఎల్లమ్మ ఆలయం నందు శ్రీ ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన. కార్యక్రమంలో రెండవ రోజు ఎల్లమ్మ విగ్రహానికి, గణపతి విగ్రహానికి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ఊరేగించి జలాభిషేకం చేయడం జరిగింది. మరియు ప్రాతశాపాసన, వాస్తు పూజన, వాస్తు శాంతి, పర్యగ్నికరణ, లక్షణోద్ధారణ, జలాధివాసన, బింబశుద్ది, ధాన్యాధివాసన, కళానాహన, శాంతి హవన, పంచావరణ స్థాపన, తత్త్యత్రయ మూలమంత్ర హవన, నీరాజన, మన్త పుష్ప సమర్పణ, నిత్యబలిహరణ, తీర్ధప్రసాద వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ దేవాలయ నిర్మాణ దాత శ్రీ పర్ష సర్వేశ్వర్ రావు యాదవ్ కుటుంబ సభ్యులు ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్ అయినవోలు మధుకర్ శర్మ వేద పండితులు గట్టు పురుషోత్తం శర్మ విక్రాంత్ వినాయక్ జోషి, అర్చక సిబ్బంది పాల్గొన్నారు. కోమల్లపెల్లి సంపత్ కుమార్ రూత్విక బృందం ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.

మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.!

ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి ధాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మున్సిపల్ పట్టణానికి చెందిన భగత్ సింగ్ తండాలోని నూతన దేవాలయంలోని విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ & ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రూ.25 వేల ఆర్థిక సహకారం అందించారు. ఈనెల 16,17,18,19 తేదీలలో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా రావలసిందిగా ఉప్పల వెంకటేష్ ఆహ్వానం అందించిన భగత్ సింగ్ తండా ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు.ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ సైన్యం & తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధమోని రమేష్ గౌడ్ ,భగత్ సింగ్ తండా నాయకులు రాజు నాయక్, బాలు నాయక్, హర్యా నాయక్, దేవేందర్ నాయక్, భాస్కర్ నాయక్, బోడు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర మహోత్సవ.

నేటి ధాత్రి కథలాపూర్

 

 

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట్ గ్రామంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు గా బావించే స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో కనుల పండగ కొనసాగింది.

స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులు కావడం జరిగింది.

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి.

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి-చండికాంభ మాత సమేత జయంతి మహోత్సవ ఆహ్వానము

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఈ కార్యక్రమునకు విచ్చేయుచున్న పూజ్యులు శివాచార్య మహా స్వాములు

1. ష బ్ర॥ శ్రీ108 శ్రీగురు శివయోగి శివాచార్య మహాస్వామి గారు, జంగమయ్య గుట్ట తంగెడపల్లి

2. శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ గారు, బర్దిపూర్

3. శ్రీశ్రీశ్రీ ష||బ్ర|| 108 వీరేశ్వర శివాచార్య మహారాజ్ గారు, హీరేమఠ్ ధనసిరి

4. శ్రీశ్రీశ్రీ షుబ్ర॥ చంద్రశేఖర శివాచార్య మహారాజ్ గారు, బేమలే ఖేడ్

5. శ్రీశ్రీశ్రీ బసవలింగ అవధూతగిరి మహారాజ్ గారు మల్లన్నగుట్ట ఆశ్రమము

గ్రామ శ్రీ సిద్ధేశ్వర మఠం నుండి స్వామి వారి పాదుకలను మంగళవాయిద్యములతో మరియు భజన
భక్తి గీతాలను ఆలపిస్తు మందిరమునకు తీసుకొని పోవుట.ద్వజరోహణము – శిఖర పూజ గురుస్వాములచే.మహన్యాస పూర్వక రుద్రాబిషేకము. తీర్థ ప్రసాదములు, రాత్రికి భజన కీర్తనములు
స్వామి వారికి రుద్రాబిషేకము శ్రీ చండికాంభ మాతకు సహస్ర కుంకుమార్చన హారతులు తదుపరి తీర్థప్రసాదములు

11 మంది దంపతులచే మహన్యస రుద్రాభిషేకము

రుద్రస్వాహాకార హోమము, యజ్ఞం, మహామంగళ హారతి తదుపరి భక్తులకు

తీర్ధప్రసాదము, అన్నదానం నిర్వహించబడును.

శ్రీ రేవణసిద్దేశ్వరస్వామి వారికి డోలారోహణము

శ్రీ వీరసోమేశ్వర చండికాంభ మాత సమేత పార్వతి పరమేశ్వరుల కళ్యాణము

అఖండ దీపారాధన (2500 జ్యోతులు వెలింగించుట)

మాహాత్ములచే ప్రవచనములు

సంగీత ధర్బార్ వివిద కళాకారులచే నిర్వహించబడును. తదుపరి భజనలు.

ఘనంగా వీర నాగమ్మ పండుగ .

ఘనంగా వీర నాగమ్మ పండుగ

వెల్దండ/ నేటి ధాత్రి

 

 

కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు వీరనాగమ్మ పండుగను నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామంలో గత రెండు రోజులుగా ఆరెకటిక కులస్తులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తికి ముక్తికి అమ్మవారు ప్రసిద్ధి చెందారు.

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 


జహీరాబాద్ నియోజకవర్గం గ్రామాల్లో..ఘనంగా. ఈస్టర్ పండుగ వేడుకలు. నిర్వహించారు. యేసు క్రీస్తు. వారు. మానవాళి. పాప పరిహారం. నిమిత్తం. సిలువ వేయబడి.. తిరిగి మూడవ రోజు నాడు తిరిగి లేచాడని. క్రైస్తవులు. నమ్ముతారు..ఆయన. శుక్రవారం నాడు.సిలువ వేయబడి.. శనివారం నాడు.. సమాధిలో.. ఉంచబడి.. ఆదివారం ఉదయం. ముడున్నర. గంటల సమయం లో సమాధిలో నుండి. తిరిగి పునరుతానుడై. లేప బడుతాడు..ఆ తరువాత కొందరు శ్రీలకు. అటు తరువాత ఐదు వందలకు పైగా. మనుషుల కు కనిపించి. అటు తరువాత. ఆయన.. పరలోకం వెళ్లిపోయడు.. అందు నిమిత్తం.. ఇస్టర్.. పండుగ ను. నిర్వహించు కొంటారు.. ఈ పండుగ కార్యక్రమం లో. పాస్టర్ లు. సంఘపెద్దలు. భక్తులు. యువకులు. తదితరులు పాల్గొన్నారు

సీతారాములవారి కల్యాణ మహోత్సవం.

నస్పూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములవారి కల్యాణ మహోత్సవం
ముఖ్య అతిథులుగా లోపాల్గొన్న మంచిర్యాల డిసీపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సి ఐ అశోక్ కుమార్

నస్పూర్ నేటిదాత్రి

 

నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామాలయంలో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైగోపేతంగా కన్నుల పండుగా జరిగినది ఈ సందర్భంగా గ్రామ నాయకులు ప్రజలు ఆలయ కమిటీ ఆలయ అర్చకుల సమక్షంలో సీతారాములవారి కల్యాణం జరిపించడం జరిగినది సకలజనులు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేదపండితులు దేవరాజు రంజిత్ శర్మ మంత్రోచ్ఛారణతో ప్రజలను ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించే విధంగా మంత్ర వేదాలతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాములవారి కళ్యాణాన్ని జరిపించారు

DCP Bhaskar

అదేవిధంగా శ్రీరామచంద్ర మూర్తి వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ తల్లిదండ్రుల పట్ల రాములవారు ఎంతటి విధేయత కలిగి ఉండేవారో వివరించారూ భక్తులందరూ శ్రీరాముని తల్లిదండ్రులను గౌరవించాలని ఆకాంక్షించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మంచిర్యాల డిసిపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సిఐ అశోక్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సీతారాముల కళ్యాణానంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపబడినది ఇట్టి కార్యక్రమాన్ని రా చకొండ కృష్ణారావు అండ్ బ్రదర్స్ నిర్వహించినారు ఆలయ కమిటీ సభ్యులు రాచకొండ గోపాలరావు రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న) మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొనపల్లి లింగయ్య ఇరికిల్ల పురుషోత్తం గడ్డం సత్యా గౌడ్ కోయిల వెంకటేష్ గరిసె రామస్వామి భీమయ్య సందీప్ బండం గోపాల్ కుందరపు రమేష్ కొయ్యలరమేష్ సిరిపురం శ్రీనివాస్ కిష్టయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్నారు

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలోని సోమవారం ఘనంగా నిర్వహించారు.
నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ ముస్లిం ప్రజలు జరుపుకున్నారు.మత పెద్ద జామీ మజీద్ ఇమామ్ మహబూబ్ నమాజ్ ను చదివారు. అనంతరం రంజాన్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ మాట్లాడుతూ భారత దేశ ముస్లింలు రంజాన్ మాసంలో లోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆర్బించడం జరిగిందన్నారు. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పాటించి ప్రతిరోజు ప్రత్యేక తరాబి నమాజు పటించి అనంతరం జకాత్ ఫిత్రాలు మరియు హదీయాలు డబ్బు రూపాన పేదలకు అనాధలకు వితంతువులకు దానం చేస్తారన్నారు. ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ ప్రత్యేక నమాజుకై ఈద్గాకు మండల స్థాయి ముస్లిం చదువుతారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికి ఒకరు అలింగనం చేసుకొని కులమతాల అతీతంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం ఖబురస్థాన్లోకు వెళ్లి చనిపోయిన బంధువుల సమాధులపై పూలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖ నాయకులు జామి మసీద్ అధ్యక్షులు మహమ్మద్ నబీ, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ అయుబ్, మీర్జా మసూద్, అలీబేగ్, మహమ్మద్ రబ్బాని, మహమ్మద్ ఆఫీస్,ఇర్ఫాన్ మహమ్మద్, అన్వర్ సయ్యద్ జావేద్ ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ….

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల ఈద్గా ప్రాంతంలో సోమవారం పవిత్ర రంజాన్ పర్వదినంలో భాగంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ…

Muslim

రంజాన్ పండుగ మతసామరస్యానికి,సుహృ ద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, ధాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.ప్రార్థనలో భాగంగా ముస్లింలు అందరు ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 కి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. రంజాన్ మాసంలో 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలలో ఉంటారని తెలిపారు. చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈద్గా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు, యాకుబ్ ఆలీ,డాక్టర్ సలీం, లాడెన్, ఎం డి పాషా, ఖలీం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, నాయకులు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, ధీకొండ శ్యాం గౌడ్,శ్రీనివాస్, గోపతి భానేశ్, సత్యపాల్, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ……

మనలో సోదర భావాన్ని పెంపొందించే ఇఫ్తార్ విందు దోహదం చేస్తుంది…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేస్తుంది…

యావత్ తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు తెలియజేశారు….

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ -గా-గుల్షన్ ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

వరంగల్ (నేటిదాత్రి ):

 

ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ పరిధిలోని మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్ -గా – గుల్షన్ ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజుఅనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించి ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అలాగే నేను ఈ ప్రాంతం నుంచి పెరిగి ఉన్నత విద్యలను అభ్యసించి నా చిన్నతనం నుంచి ఎన్నో క్రీడలో పాల్గొన్ని ఒక హకీ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో వెళ్లడం నాకు చాలా ఆనందకరమని మరియు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం నాకు చాలా సంతోషకరమని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన తెలియజేయడం జరిగింది..

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ పర్వదినం రోజున ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు కోరారు….

ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెవ్వు శివరామకృష్ణ, ముస్లిం పెద్దలు బాబా భాయ్, జమీర్, సిధిక్,అఫ్జల్, ఎం.డి సర్వర్, ఎం.డి నయీముద్దీన్ ముస్లిం సోదరులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు….

ఘనంగా పుష్పక విమాన రథోత్సవం..

ఘనంగా పుష్పక విమాన రథోత్సవం..

: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (జాతర) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం విమాన రథోత్సవ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు. అనంతరం రరమలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి. వేదమంత్రాల మధ్య స్వామివారి రథాన్ని లాగారు.

ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రామలింగేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాంతం అంతా పచ్చని పంటలతో, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకొండానని అన్నారు. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రుడనై ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి రమ్య, రామలింగారెడ్డి, ఆలయ కార్య నిర్వాణ అధికారి నాగిరెడ్డి, కోడి శ్రీనివాసులు, దోటి టి వెంకటేశ్ యాదవ్, నల్లగంటి మల్లేష్ ఆలయ సభ్యులు, వంశపార్యపర్య అర్చకులు, స్థానిక నాయకులు, తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్..

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్

పక్షుల సంరక్షణ పై సమగ్ర అధ్యయనం

అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ

మంచిర్యాల:నేటి ధాత్రి

పర్యావరణంలో మిగిలిన జీవరాశుల కంటే ఎంతో జీవ వైవిధ్యం కలిగిన పక్షుల సంరక్షణపై సమగ్ర అధ్యయనం జరగాలని ఇందుకు దీర్ఘకాలిక పరిశీలన అవసరమని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా ) డాక్టర్ సువర్ణ అన్నారు.అటవీ శాఖ మరియు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్,నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో మంచిర్యాలలో గత రెండు రోజులుగా జరిగిన బర్డ్స్ ఫెస్టివల్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది.ఈ సందర్భంగా మంచిర్యాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు•పక్షుల గమనానికి పరిధిలు లేవని అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర వహిస్తున్నాయన్నారు. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయని ఇలాంటి పక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం పక్షులని చెప్పారు.ఇవి వాటి భాషలో మంచి కమ్యూనికేషన్ కలిగి రాకపోకలు కొనసాగిస్తూ పర్యావరణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా పక్షుల గురించి తమ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోవాలన్నారు. ఇందుకుగాను పాఠశాల ఉపాధ్యాయులు సైతం పక్షుల స్థితిగతులు వాటి జీవన విధానంపై విద్యార్థులకు క్విజ్ లు నిర్వహించాలన్నారు. మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో వేల పక్షులు సంచరిస్తున్నాయన్నారు.గత రెండు సంవత్సరాలుగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో దీర్ఘకాలిక పరిశీలన చేసి 201 జాతుల పక్షులను గుర్తించామన్నారు.జిల్లా పరిధిలోని మిగిలిన అటవీ డివిజన్ లలో కూడా అటవీ సిబ్బంది తమ పరిధులలో పక్షుల గమనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేసుకోవాలని సూచించారు.కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్ మాట్లాడుతూ కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతంలో రాష్ట్రంలోనే అరుదైన రాబందుల సంరక్షణకు తాము తీసుకుంటున్న చర్యల వల్లే వాటి జనాభా పెరుగుతుంది అన్నారు.నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ శాస్త్రవేత్త మహేష్ శంకరన్ మాట్లాడుతూ సవన్నా గడ్డి మైదానాలకు మరియు అడవులకు మధ్య వ్యత్యాసాన్ని,అక్కడి జీవవైవిద్యం గురించి వివరించారు.పక్షులు క్రమంగా అంతరిస్తే బయోడైవర్సిటీ దెబ్బతింటుందని,వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ విజయన్ మాట్లాడుతూ పక్షులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ లు ఉండాలన్నారు.బి ఎన్ హెచ్ ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ సాథియా సెల్వం మాట్లాడుతూ ముంబై లాంటి నగరాల్లో ఆరో తరగతి నుంచే పక్షుల గురించి ప్రత్యేకంగా రికార్డులు నిర్వహిస్తున్నాని,ఇక్కడి పాఠశాలల్లో కూడా బర్డ్స్ ఏకో క్లబ్ నిర్వహించుకోవాలన్నారు. వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రధాన అధికారి బండి రాజశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అటవీ శాఖ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో పక్షుల అధ్యయనం పై సమగ్ర పరిశీలన చేయగా 11 పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయన్నారు. 57 జాతుల పక్షులు కేవలం అటవీ,ప్లాంటేషన్ ఏరియాలోని సంచరిస్తున్నాయని పరిశీలించామన్నారు.99 జాతుల పక్షులు కీటకాలు తినే వాటిగా,16 జాతుల పక్షులు కేవలం పండ్లను తినే పక్షులుగా గుర్తించామన్నారు. పక్షుల అధ్యయనం,సంరక్షణకు తమ సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ బర్డ్స్ ఫెస్టివల్ సందర్భంగా పక్షుల సంరక్షణలో సేవలందిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు సభ్యులకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ,కవ్వాల్ టైగర్ రిజర్వ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతా రాములు కలిసి జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ కుమార్ పాటిల్,మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ అధికారి సర్వేశ్వరరావు,పక్షులపై అధ్యయనం చేస్తున్న ప్రముఖులు డాక్టర్ శాంతారామ్,డాక్టర్ బిక్షం గుజ్జ, డాక్టర్ సాథియా సెల్వం, సంజీవ్ మీనన్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్ అధికారులు,డిప్యూటీ రేంజ్ అధికారులు,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు,బీట్ అధికారులు,పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రత్యక్షంగా చూస్తూ. ..ఆసక్తి కనబరుస్తూ… ఆకట్టుకున్న బర్డ్స్ ఫెస్టివల్.

ప్రత్యక్షంగా చూస్తూ. ..ఆసక్తి కనబరుస్తూ… ఆకట్టుకున్న బర్డ్స్ ఫెస్టివల్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

birds festival

అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF), నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF) సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిది లో గల బొక్కల గుట్ట సమీపంలోని గాంధారి వనం, గాంధారి ఖిల్లా లో శనివారం బర్డ్స్ ఫెస్టివల్ నిర్వహించారు.ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మంచిర్యాల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, ములుగులోని అటవీ కళాశాల విద్యార్థులు వివిధ బృందాలుగా విడిపోయి అనేక రకాల పక్షులను వీక్షించారు.పలు రకాల పక్షులను ప్రత్యేక్షంగా చూస్తూ ఆసక్తిగా కొనసాగిన ఈ బర్డ్స్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంది. WWF, NCF ప్రతినిధులు హర్ష త్రివేని, అమృత, సమాక్షి లు ఇక్కడికివిచ్చేసిన వారికి వివిధ రకాల పక్షులను చూపిస్తూ వాటి వివరాలను వివరించారు. పక్షుల కిలకిలా రాగాలు వింటూ వాటిని ప్రత్యక్షంగా చూస్తూ వాటి జీవ వైవిధ్యం గురించి తెలుసుకున్నారు. పక్షులు పర్యావరణానికి ఏ విధంగా మేలు చేస్తాయో, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇలాంటి బర్డ్స్ ఫెస్టివల్స్ వల్ల తెలియని విషయాలు తెలుసుకోవచ్చని, తద్వారా వాటిని కాపాడుకోవాలనే చైతన్యం వస్తుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో అటవీ రేంజ్ అధికారులు అప్పలకొండ, శివకుమార్ ,ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్,ఇంచార్జి రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రేంజ్ అధికారులు హాఫిజూద్దీన్, సంతోష్, ఎఫ్ ఎస్ ఓ, బీట్ అధికారులు రామకృష్ణ, పోశెట్టి, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ..

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్(సిల్వర్ జూబ్లీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…..

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

జడ్.పి.హెచ్.ఎస్ బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ విద్యార్థులు… 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా“””25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ”” కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పుడు పాఠాలు నేర్పించిన టీచర్లు అందర్నీ పిలిచి శాలువాలు, పూలదండలు, మొక్కలు,, మెమొంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీచర్లందరూ విద్యార్థుల తీరును చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మా విద్యార్థులు మరింత పైకి ఎదగాలని, మరిన్ని గొప్ప గొప్ప ఆశయాలను పూర్తి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థులు ఆటపాటలతో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థుల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఎల్ జడ్పిహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల తో పాటు పలువురు పాల్గొన్నారు…

బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజుల నుండి పండుగ వాతావరణం లో శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ సమేత సీతలాంబ(బొడ్రాయి),శ్రీ పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. , సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు డప్పుచప్పు ళ్లు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ సమేత సీతలాంబ(బొడ్రాయి) మరియు శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యా లతో ఉండాలని కోరుకున్నారు. కొప్పుల గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version