
ఉత్తమ ప్రయాణికులను సన్మానం చేసిన డీఎం.!
ఉత్తమ ప్రయాణికులను సన్మానం చేసిన డీఎం నర్సంపేట నేటిధాత్రి: ఆర్టీసీ కర్టసి డే సందర్బంగా నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ బస్టాండులోని ప్రయాణికులకు మర్యాదపూర్వకంగా గులాబీ పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.బస్సులో రెగ్యులర్ ప్రయాణం చేస్తన్న నర్సంపేటకు చెందిన మెండు సారంగం,నారక్కపేట గ్రామానికి చెందిన లెంకల ప్రనీతలను శాలువాలతో సన్మానం చేసి గులాబీ పుష్పాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ,ఏడిసి మల్లికార్జున్, రవీందర్,రాంబాబు,తేజశ్వినితో పాటు డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.