వనపర్తి జిల్లా లో మరుగుదొడ్లు లేని పాఠశాలలకు నిర్మాణం చేపట్టాలి
కలెక్టర్ అధికారులుకు ఆదేశాలు
వనపర్తి నేటిదాత్రి .
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని, మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో నిర్మాణం చేపట్టే విదంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అంగన్వాడీల్లో తాగునీటి వసతి, పై అదనపు కలెక్టర్ యాదయ్య తో కలిసి సంబంధితఅధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల సౌకర్యం లేని పాఠశాలల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద టాయిలెట్స్ మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు త్వరగా చేపట్టాలని కోరారుఅదేవిధంగా జిల్లాలోని 35 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కోసం చేపట్టిన పనులపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు కేవలం 9 అంగన్వాడీల్లో మాత్రమే తాగునీటి వసతికి పనులు పూర్తి చేసినట్లు, ఇంకా 26 అంగన్వాడీల్లో పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పగా ఆయా పనులని జనవరి మొదటి వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు ఈసమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని ఉమాదేవి, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
