
ఇళ్ల మధ్యలో మురికి నీరు.
ఇళ్ల మధ్యలో మురికి నీరు. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో మురుకి నీరు మొత్తం ఇళ్ల మధ్యలో చేరుతోంది. మురికి నీరు ఇళ్ల మధ్యలో చేరడంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దుర్వాసన వెదజలడంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురికి నీటిని తొలగింపజేయాలని కోరుతున్నారు.