జన గణన లో సెల్ఫ్ ఎన్యుమరేషన్…

జన గణన లో సెల్ఫ్ ఎన్యుమరేషన్…

మీ ఫోన్ ద్వారా జన గణన లో మీ కుటుంబ వివరాల మీరే పొందుపరచుకోవచ్చు

మహబూబాబాద్/ నేటి ధాత్రి

ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ పెనుగొండ ఆధ్వర్యంలో ( రేవ) జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ కి సెల్ఫ్ ఎనమరేషన్ చేయనైనది, ప్రతి ఒక్కరు ఈ సెన్సెస్ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జన గణన కార్యక్రమం లో మొదట సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని మొదట ప్రారంభించేందుకు ప్రక్రియ మొదలైందని విద్యావంతులు ఎవరైనా మొబైల్ ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యుల వివరాలు మరియు నివాసాల వివరాలు పొందుపరచవచ్చని ఈ విధానం వల్ల జన గణన సులభంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవచ్చని ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ గా బాధ్యతలు చేపట్టి ప్రతి ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలు నివాసాల వివరాలు సేకరించి జనగణన చేస్తారని అన్నారు. ఈనెల 26న ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ముగిసిందని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విద్యావంతులు ఎవరికి వారు వారి కుటుంబాలను నివాస వివరాలను వారే పొందుపరచుకోవచ్చని ఈ విధానాన్ని అందరూ పాటించాలని సూచించారు. ఎన్యుమరేటర్ గా విధులు నిర్వహించే ప్రభుత్వ ఉపాధ్యాయులు మే 11 తేదీన ప్రతి ఇంటికి జన గణన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

జనగణనలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభం

మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన కార్యక్రమంలో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ పెనుగొండ తెలిపారు.

జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యావంతులు తమ మొబైల్ ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యుల వివరాలు, నివాస వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందని చెప్పారు. ఈ విధానం ద్వారా జనగణన ప్రక్రియను సులభతరం చేసి వేగంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్యుమరేటర్లుగా పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి జనగణన నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 26న ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం పూర్తయ్యిందని, మే 11 నుంచి ఇంటింటికి జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని, అవసరమైతే తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version