జనగణనలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభం

మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన కార్యక్రమంలో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ పెనుగొండ తెలిపారు.

జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యావంతులు తమ మొబైల్ ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యుల వివరాలు, నివాస వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందని చెప్పారు. ఈ విధానం ద్వారా జనగణన ప్రక్రియను సులభతరం చేసి వేగంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్యుమరేటర్లుగా పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి జనగణన నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 26న ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం పూర్తయ్యిందని, మే 11 నుంచి ఇంటింటికి జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని, అవసరమైతే తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version