congress mptc abyarthi atmahatyayatnam, కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం ఓడిపోతానన్న భయంతో ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి, పురుగుల మందు తాగారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో జరిగింది. కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాచర్ల రాములు అప్పులపాలయ్యారు. దీనికి తోడు గెలిచే అవకాశం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు, నిద్రమాత్రలు మింగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాములును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాములు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే…