సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు..

సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

నర్సంపేట, నేటిధాత్రి:

నవ భారత నిర్మాత, సమసమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను అనుసరించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, కోరబోయిన కుమారస్వామి, పట్టణ కార్యదర్శి మరియు 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఎండీ ఫరీదా, వజ్జంతీ విజయ, కలకోట అనిల్ పాల్గొన్నారు. అలాగే నాయకులు బి. లక్ష్మి, సింగరపు బాబు, దాసరి నరేశ్, మొళుగూరి రాజు, మారపెల్లి అశోక్, ఎల్లయ్య, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version