భారీ వర్షానికి పలువురు ఇండ్లలోకి నీరు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతంలో నిన్న కురిసిన అతి భారీ వర్షాలకు పలువురి ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చిందని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించిన భారతీయ జనతా పార్టీ బృందానికి పక్కనే ఉన్న కాలువ లో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీరు ముందుకు వెళ్లకుండా కాలనీలోకి రావడం జరిగిందని గమనించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్లో సంప్రదించడం జరిగింది వెంటనే స్పందించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఇ ఏఈ ప్రాంతాన్ని సందర్శించి త్వరలోనే తగు చర్యలు తీసుకొని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతులు సిరిగనేని బాబురావు మోటపోతుల చందర్ గౌడ్ బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బిజెపి బూత్ అధ్యక్షులు పెండ్యాల శ్రీకాంత్ కాలనీవాసులు ఉన్నారు