chinuku padithe andakarame, చినుకు పడితే అంధకారమే
చినుకు పడితే అంధకారమే ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ మండలాలలో బుధవారం సాయంత్రం 7.30గంటలకు వచ్చిన గాలి దుమారం వల్ల ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని గురువారం వరకు విద్యుత్ అధికారులు పునరుద్దరించలేదు. గురువారం రాత్రి 11:30 గంటలు దాటినా విద్యుత్‌ను పునరుద్దరించకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకపక్క ఉక్కపోత, ఎండ తీవ్రతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. కరెంటు లేకపోవడంతో తాగడానికి నీరు లేదని కొంతమేర విద్యుత్ అధికారులపై…