మండల బీజేపీ ప్రధాన కార్యదర్శులు నియామకం
మహాదేవపూర్ ఆగస్టు 23 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన బల్ల శ్రావణ్ కుమార్, లింగపెల్లి వంశీదర్ రావు లను శనివారం రోజున బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునిల్ రెడ్డీ, రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ ల ఆధ్వర్యం లో మహాదేవపూర్ మండల బిజెపి ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. మండల నూతన కార్యదర్శుల నియామక అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పార్టీని మండలంలో విస్తరీంపచేస్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతనికి కృషి చేస్తామని, రానున్న స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేసి బీజేపీ సత్తాచాటుతామణి, అలాగె మా నియామకానికి కృషి చేసిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డీ కి, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునిల్ రెడ్డీ కి, రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ కి మాహదేవపూర్ మండల అధ్యక్షులు రాంశేట్టి మనోజ్ కి, మండల నాయకులకు,బూత్ అధ్యక్షులకు, కార్యకర్తలకు ధన్యవాదలు తెలిపారు.