chairmenga mahilaku avakasham kalipinchali, చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..
చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి.. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా పద్మావతికి అవకాశం కల్పించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు నుండి ఎప్పుడూ కూడా మహిళలకు అవకాశం కల్పించలేదని, ఈసారి 100శాతం దివ్యాంగురాలైన పొట్టబత్తిని పద్మావతికి అవకాశం కల్పించాలని…