హన్మకొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు – భారీ అవినీతి బట్టబయలు

హన్మకొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు – భారీ అవినీతి బట్టబయలు

హనుమకొండ, నేటిధాత్రి.

 

హనుమకొండ జిల్లా వరంగల్ (ఆర్.ఓ) సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు భారీ అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఏప్రిల్ 2న నిర్వహించిన ఈ దాడుల్లో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి.

తనిఖీల సమయంలో కార్యాలయంలో అనుమతి లేకుండా తిష్టవేసిన 20 మంది దళారులు/డాక్యుమెంట్ రైటర్లను గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి లెక్కల్లో చూపని రూ.47,450 నగదు, అలాగే 70 రిజిస్ట్రేషన్‌కు సంబంధించినవి కాని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

దళారుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా, సబ్‌ రిజిస్ట్రార్ అధికారులు జమలాపురం రామనరసింహారావు (SRO-I), దావులూరి ఆనంద్ (SRO-II) లతో జరిగిన వాట్సాప్ చాట్‌లు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా గత ఏడాది కాలంలో ఫోన్‌పే ద్వారా దాదాపు రూ.42,03,125 (42లక్షలు) లంచాల రూపంలో లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఇంకా, కార్యాలయంలో 204 డెలివరీ చేయని రిజిస్టర్డ్ పత్రాలు అధికారుల వద్దే ఉండటం గమనార్హం. ఇది విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి ఉదాహరణగా అధికారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో సబ్‌ రిజిస్ట్రార్ల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.24,61,540 నగదు, సుమారు 819.5 గ్రాముల బంగారం, 2.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, కపిల్ చిట్స్‌లో రూ.30,10,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా గుర్తించారు.

తనిఖీల సందర్భంగా మరికొన్ని అక్రమాలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నేటిధాత్రి, హన్మకొండ.

ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగుల నుండి లంచం డిమాండ్‌కు గురైతే, ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఎన్నికల చెక్పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం. జిల్లెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టునుఆకస్మికంగా తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీసు చెక్పోస్ట్ ను తనిఖీ చేస్తూ పలు వాహనాలను ఆపి తనిఖీ చేయాలని తదుపరి వాహనాలు సంబంధించిన రిజిస్ట్రేషన్ పరిశీలించడంతోపాటు ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలను చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పలు సూచనలు చేస్తూ తనిఖీ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమంగా నగదు మద్యం రవాణానచేస్తున్నట్టు దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలతో పాటు.వాటినిఅరికట్టాలనీ సూచిస్తూ ఓటర్లను ప్రభావితం పెట్టడానికి డబ్బులు మద్యం ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్కుసిబ్బందివారికి సమాచారం అందించాలని సూచిస్తూ శాంతి భద్రతలకు విఘాతంకలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమా వలిప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా అనుమానం కలిగినచో వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి తనిఖీల కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే. రూలర్ సిఐ మొగిలి పోలీస్ సిబ్బంది చెక్పోస్ట్ సిబ్బంది తదితరులు ఉన్నారు

ఎన్నికల నియమావళి కఠిన అమలు

మండలం లో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం

ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి

నిషేధిత వస్తువుల రవాణా పై నిఘా

సోషల్ మీడియా నందు అసత్య ప్రచారాలు చేసిన ఇతర వ్యక్తుల మనోభావాలు కించపరిచేలా పోస్ట్ చేసిన కఠిన చర్యలు తప్పవు

ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్రభాను

గుండాల సీఐ రవీందర్, ఎస్సై రహూఫ్

గుండాల,నేటిధాత్రి:

 

సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు, నియమనిబంధనల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమలు చేస్తాము. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున మండల ప్రజలు, పౌరులు, రాజకీయ పార్టీలు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి అన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుంది అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగలాగా జరగాలని అందరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత గా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని అన్నారు. నియమావళి నిభందనలు ప్రకారం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిఘా పెడుతున్నాం, ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి డయల్ 100 కు సమాచారం ఇవ్వాలి.
ప్రతి పౌరుడు స్వేచ్చగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. నిషేదిత వస్తువులు అక్రమ మద్యం, నాటు సారా, డబ్బు, దృవపత్రాలు లేని విలువైన ఆభరణాలు, వస్తువులు అక్రమ రవాణా జరగకుండా ఉమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తాం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాము.
గత ఎన్నికలలో కేసుల్లో ఉన్న నెరస్థులను ముందస్తుగా బైండోవర్ చేయడం, సమస్యలు సృస్థించే ట్రబుల్ మాంగర్స్ లను ముందస్తు బైండోవర్ చేస్తాం.సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా రూమర్స్ సృష్టించడం లాంటివి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే సంభందిత వ్యక్తులు, వాట్సప్ అడ్మిన్ లపై చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు.
ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలు తీసుకోరాదు.
ఎన్నికల ప్రచారంలో అశ్లీల, అసత్య, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరాదు.
నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం చట్టవిరుద్ధం అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదు.
సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
ఎన్నికల సమయంలో ఎన్నికల కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి అన్నారు గుండాల సిఐ ఎల్ రవీందర్, ఎస్సై సైదా రవూఫ్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version