
వేతన జీవులను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్..
వేతన జీవులను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్ పలమనేరు(నేటి ధాత్రి) సాధారణంగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారంటే వేతనాలు పెరుగుతాయని ఎదురుచూసే వేతన జీవుల ఆశలను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అడియాసలు చేశారు. 2025`26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రసంగంలో కొన్ని పథకాల అమలు కోసం కేటాయింపులు చేస్తామన్నారు తప్ప, జీతాల కోసం పనిచేస్తున్న కార్మికులకు బడ్జెట్లో చోటు ఇవ్వలేదు. ఎటువంటి జీఓ ఇవ్వకుండానే మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసిన ఘనత తమదేనని…