avinithiki…suthradari..,అవినీతికి… సూత్రధారి…?
అవినీతికి… సూత్రధారి…? వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్ కార్యాలయంలో అవినీతి భాగోతాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. ‘నేటిధాత్రి’లో గత నాలుగురోజులుగా ఇంటర్మీడియట్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి లీలలపై వరుసగా కథనాలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. కార్యాలయంలో తీగ లాగితే ఢొంక కదిలిన చందంగా మరిన్ని విషయాలు బయటికొస్తున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల అనంతరం మార్చి-ఏప్రిల్ నెలలో నిర్వహించిన పేపర్ వాల్యుయేషన్ క్యాంపులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లుగా తెలుస్తున్నది. ఇదంతా కార్యాలయంలో ఓ సీనియర్ ఉద్యోగితో పాటు మరికొంత…