autonu deekottina tractor, ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ – నలుగురికి తీవ్రగాయాలు వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద కూలీలతో వరంగల్‌కు వెళుతున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలకు గాయాలు కాగా నలుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కూలీలు వర్ధన్నపేట మండలకేంద్రానికి చెందినవారు.