సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం…

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

కల్వకుర్తి/ నేటి దాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం వైశాఖ శుద్ధ దశమి ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో ఆలయ చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో పట్టణ, మండల,ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్, అవోప అనుబంధ సంఘాల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం వాసవి మాత జన్మదిన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఆర్యవైశ్యులు అందరికీ ఇది ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి కి ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు జూలూరు రమేష్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వాసా శేఖర్, కార్యదర్శి సంబు ముత్యాలు, కోశాధికారి అప్పయిపల్లి శ్రీనివాస్, ఆ వోప అధ్యక్షుడు కల్మిచర్ల రాఘవేందర్, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చిగుల్లపల్లి శ్రీధర్, గుగ్గిల శంకర్, వాసవి క్లబ్ అధ్యక్షుడు బాదం హరీష్, జోన్ చైర్మన్ బాదం రఘు,కల్వ ఆంజనేయులు, కల్వ రమేష్, గంప వెంకటేష్, కంది ప్రవీణ్, పాపిశెట్టి శ్రీనివాస్, గుబ్బ కిషన్, గందే రవి, శివ రాఘవేందర్, కల్వ కిషోర్, పాపిశెట్టి ప్రసాద్, చెరుకు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version