సుందరయ్య నగర్ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి.

సుందరయ్య నగర్ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పుచ్చలపల్లి సుందరయ్య గారి 40 వర్ధంతి సందర్భంగా సుందరయ్య నగర్ పుర ప్రముఖులు, ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిస్టు లీడర్ గా నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో ఒకరైన మహోన్నతమైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య,14 ఏళ్ల వయసులోనే గాంధీ గారు ఇచ్చిన పిలుపుమేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఉప్పు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగిందన్నారు. 1913లో మే ఒకటో తారీఖున నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగిందన్నారు. 1952లో పార్లమెంట్ సభ్యుడిగా, 1956లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొంది అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్య అని తెలిపారు. పార్లమెంటుకు ఒక సామాన్య కార్యకర్తగా సైకిల్ పై వెళ్ళిన ఘనత సుందరయ్యకె దక్కుతుందని అన్నారు. అటు రైతు సమస్యలపైనే కాకుండా సమాజంలో ఉన్న అంటరానితనాన్ని పారా తోలడానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి సుందరయ్య గారేనని అన్నారు.
సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రా న్ని సుందరయ్య నగర్ గా నామకరణ చేసుకోవడం మాకు గర్వాంగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు దుబాల వెంకటేశం,బత్తుల రమేష్, సుంచు ప్రకాష్. రాపెల్లి రమేష్,గాలిపెళ్లి సురేష్, కట్ల సతీష్, బొజ్జ శ్రీనివాస్,లింగంపల్లి దేవయ్య,మార్గం లక్ష్మణ్,సూరం వినయ్,ఆడెపు సత్తయ్య,
ఆడెపు సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు

దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం.!

రేపు రంజోల్ దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ. స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. లియో క్రాఫ్ట్, ఇంటిరియర్స్ అధినేత చెవుల ఉమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి గణపతి పూజ, పంచామృత అభిషేకం, 9గం. లకు దత్త హోమం, 11. 30 కి పూర్ణహుతి, మ. 12 గం. లకు స్వామివారికి హారతి, 12. 30 కి అన్నప్రసాద కార్యక్రమలు జరుగునని తెలిపారు.

రత్నాకర్ రావు 5వ వర్ధంతి.

మెట్ పల్లి మే 10 నేటి ధాత్రి:

మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 5వ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు చేతుల మీదుగా వ్యవసాయ మార్కెట్ అమాలి చాట జాడు కార్మికులకు మజ్జిగ పాకెట్లు కూల్ డ్రింక్ పాకెట్స్ పంపిణీ చేశారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ మా నాన్నమంత్రిగా ఉండగా కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక పనులు చేశారని పశు వైద్యశాల ఏర్పాట్లు చేశారని ఆయన కోరుట్ల నియోజకవర్గంలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికి నడుస్తున్నాయని అన్నారు .
ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్ జువ్వాడి చంద్రశేఖర రావు పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మెట్పల్లి మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు యమ రాజయ్య జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ తుమ్మలపల్లి రాంప్రసాద్ పూదారి నర్సాగౌడ్ మర్రి సహదేవ్ పిప్పిర రాజేష్ మోకిం షకీల్ లింగారెడ్డి బుర్ర మహేందర్ అన్నమయ్య నరేష్ జాకీర్ రమేష్ బత్తుల భరత్ పూదారి రాము పుల్ల రాజా గౌడ్ మహేందర్ యూట్యూబ్ రాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

వనపర్తి లో వాసవి కన్యకా పరమేశ్వరి,!

వనపర్తి లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కలశం ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి:

 

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ నిర్వహించారు . బుధవారం రాత్రి ఆర్యవైశ్య మహిళలు గా గాంధీ చౌక్ లో మహిళలు భక్తి పాటలతో కోలాటం వేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మేరకు పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి ఇటుకురి వీరయ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూమేష్ కుమార్ శెట్టి పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురామ్ మారం బాలీశ్వరయ్య శెట్టి బక్తులు పాల్గొన్నారు

ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభ.!

ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలి

ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎం సి పి ఐ యు-ఏఐసీటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న సోమవారం వరంగల్ జిల్లా మచ్చాపూర్ లో నిర్వహించే ఎంసీపీఐయు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూఅమరజీవి మద్ది కాయల ఓంకార్ నర్సంపేట నియోజకవర్గం నుండి 5సార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచినాడని ఆయన ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం గల మెత్తడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా సమస్యల అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడు అని ఆయన అన్నారు.1984లో ఎం సి పి ఐ పార్టీని స్థాపించి అంచలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపచేసి 2006లో ఎం సిపిఐ యు గా ఏర్పరిచారని అన్నారు.నిత్యం బడుగు, బలహీన వర్గాల సామాజిక అభివృద్ధి కొరకు తన జీవితకాలమంతా పోరాటాలను కొనసాగించినాడని వారి పోరాట ఫలితమే నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనని ఆయన అన్నారు.ఈ సభకు ప్రముఖ కవులు గోరేటి వెంకన్న,జయరాజు గాయకులు యోచన,ప్రజా కళాకారులు,వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని ఈ సభ విజయవంతం కొరకు విద్యార్థులు,యువకులు,సామాజిక ఉద్యమకారులు,అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:బొల్లోజు రామ్మోహన్ చారి,ధరావత్ రమేష్,వేల్పుల వెంకన్న,గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్,దుగ్గిరాల వెంకన్న,ధారావత్ వీరన్న, సాంబ,బెజ్జం ఐలేష్,కస్తూరి వెంకన్న,లాకావత్ రవి,దేవుల,బానోత్ ఈసు, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆ ర్ సి

వనపర్తి నేటిదాత్రి :

 

 

మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వరలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులో రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి శ్రీశైలంమల్లికార్జున నిత్య అన్నదాన సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలోగుర్రం జగదీశ్వరయ్య
మల్లికార్జున్ లోటస్ సెలూన్ రామకృష్ణ కలిసిపూలబోకె ఇచ్చి శాలువతో రావులను ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు.

కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి గొప్ప సంఘ సేవకులు , విద్యాదాత, మతసామరస్యం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని ప్రతి మనిషికి చదువు తప్పక అవసరమని పేద విద్యార్థుల కోసం ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతిగృహాలకు, డబ్బులు దానం చేసిన గొప్పదాత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో రెడ్డి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా రెడ్డి హాస్టల్ ని నెలకొల్పిన వ్యక్తి బహదూర్ వెంకట రామిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగు మామిడి కృష్ణారెడ్డి ఎడుమల,హనుమంత రెడ్డి,వేసి రెడ్డి రామిరెడ్డి, కుంబాల మల్లారెడ్డి,కంది భాస్కర్ రెడ్డి, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు.!

ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు నీయులు కొనింటి మానిక్ రావు గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడం పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి ,తాజా మాజీ సర్పంచులు చిన్నారెడ్డి, విజయ్, నాయకులు లక్ష్మణ్ యాదవ్,బాబు మియ తదితరులు.

శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం.

ఘనంగా శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

 

వరంగల్ నేటిధాత్రి

 

వరంగల్ హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సానబోయిన సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నవల నాటక సినిమా కథ రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జిగిలి గోస, అనగనగా ఒక కోడి పెట్ట, వీటిపై అనర్గళంగా మాట్లాడారు.

College

తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలుగు భాష యొక్క ప్రాచుర్యం పెంచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, మనమందరం తెలుగు భాషను ప్రోత్సహించాలని మన పిల్లలకు తెలుగు భాష మాట్లాడించాలని, మనమందరం మానవ విలువలను పెంపొందించే విధంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ బిఓఎస్ డాక్టర్ మంతిని శంకరయ్య, కళాశాల అధ్యాపకులు పరశురాం జయకృష్ణ, మేకల లింగమూర్తి, శ్రీధర్ల కుమారస్వామి, శెట్టి దేవరాజు, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు

పాఠశాల వార్షికోత్సవ వేడుకలు.!

ఘనంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగామండల విద్యాధికారి అంబాటి వేణు కుమార్ హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తిరుపతయ్య, మాజీ ఎంపిటిసి గుండి ప్రవీణ్, మాజీ ఉపసర్పంచ్ మేడి శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ చిలువేరి స్వప్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, మ్యాకల నాగరాజు, మడ్డి మనోజ్, ఉత్కం శ్రీనివాస్, మచ్చ పవన్ కళ్యాణ్, మంద రాజశేఖర్, కత్తి సాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి.!

భారత రాజ్యాంగ పితామహుడు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు పట్టణం లోని *రహదారి,మున్సిపల్,బాబు మోహన్ కాలనీ,లో గల విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా,ప్రజాస్వామ్య పరిరక్షకునిగా,సంఘసంస్కర్తగా,విఖ్యాతుడైన అంబేద్కర్ గారికి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్ , పెంట రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,పాక్స్ చైర్మన్ చైర్మన్ మచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహి ఉద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు మిథున్ రాజ్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ, బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాగారం లో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు.

నాగారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

అంబెడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన డాక్టర్ సిరంగి సంతోష్,రాజభద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

మండలం లోని నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,మున్సిపల్ మాజీ చైర్మన్ మార్తా రాజ భద్రయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బాబు యాదవ్,కన్వీనర్ కొమ్మిడి మహేందర్ రెడ్డి,కార్యక్రమ కో కన్వీనర్ లు దుమల నగేష్,కునూరు విరస్వామి,జనరల్ సెక్రటరీ జంగిలి రాజేందర్ రావు,కోశాదికారి ఎదునూరి లింగయ్య,సీనియర్ నాయకులు గుండబోయిన నర్సయ్య,పుచ్చకాయల మల్లారెడ్డి,బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్,బూత్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,బిక్షపతి,గొట్టే మొగిలి,పైడిపెల్లి మాజీ సర్పంచ్ సురేష్,పోచారం బూత్ అధ్యక్షులు గంపలపెళ్ళి రాజు,లక్ష్మిపురం బూత్ అధ్యక్షులు సంపత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

చల్లగరిగలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

చల్లగరిగలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

చిట్యాలమండలం లోని చల్లగరిగ గ్రామంలో నేడు అంబేద్కర్ చౌరస్తాలో డా: బిఆర్ అంబేద్కర్ 134,వ జయంతి వేడుకలు సామాజిక కార్యకర్త నోముల శివశంకర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి అశోక్ గార్ల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి,స్విట్స్ పంచిపెట్టాడం జరిగింది, అనంతరం
మాట్లాడుతూ డా: బిఆర్ అంబేద్కర్ గురించి 120 దేశ ల రాజ్యాంగం లను అవపాసన పట్టీ ప్రపంచంలో నే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన పాలన విదానాన్ని,తేలిపిన విశ్వ మేధావి అని కొనియాడారు, ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజు గారు, సినియర్ నాయకులు నల్ల రాజిరెడ్డి , సిరి పెళ్లి జంపయ్య గారు, నోముల నాగరాజు గారు,సోమిడి రఘుపతి ,జరిపోతుల ఓదేలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి,దూడపాక సరోత్తం, మరియు, బిసి ఎస్టీ మైనార్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి

మహోన్నతుడి ఆశయాలను కొనసాగించాలి సోమరపు శ్రీరాములు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మహోన్నతుడు మహనీయుడు భారతదేశపు రాజ్యాంగ పితామహుడు భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 135 వ జయంతి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మోహినుద్దీన్ ఆదేశాల మేరకు సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎన్ హెచ్ ఆర్ సి అండ్ డబ్ల్యు ఈ ఓ కేసముద్రం మండల ప్రెసిడెంట్ సోమారపు శ్రీరాములు, జన్ను శీను పూలమాలతో సత్కరించిన అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఈ గొప్ప మహనీయుడి జయంతి జరుపుకోవాలని చాలా సంతోషకరం వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిస్తూ  తెలియజేశారు.

అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంద

 

ర్భంగా ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని జమియత్ ఉలమా-ఇ-హింద్ మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్
ఘన నివాళులు అర్పించారు.అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు.

డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 134వ జయంతి.

ప్రపంచ మేధావి, సమ సమాజ కాంక్షి,రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 134వ జయంతి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

అబ్రహం మాదిగ మాట్లాడుతూ… అంబేడ్కరిజం అంటే కేవలం అయన గారి జన్మ.మరణ దినాలు కాదు నిర్వహించాల్సింది,ఆయన ఆశయాలను కోనసాగించటమే అయనకు మనమిచ్చే నివాలి.
సమాజంలోని కుల వివక్షతకు,అంటరానితనానికి వ్యతిరేకంగా తన ఆఖరి శ్వాస వరకు పోరాటం చేసి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సాహెబ్ గారు.
ఎస్సీ వర్గీకరణ పై జీ ఓ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ పక్షాన ధన్యవాదములు తెలుపుతున్నాము…
ఈట్టి కార్యక్రమంలో… ఉల్లాస్ మాదిగ, జైరాజ్ మాదిగ, సుకుమార్ మాదిగ, రాజు మాదిగ, కిట్టు మాదిగ, టీంకు మాదిగ, రాజు మాదిగలు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్మించారు ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు కన్నె అరుణ్ కుమార్ జనరల్ సెక్రెటరీ కన్వీనర్ రెడ్డి మల్ల సుఖేందర్ పోకల శ్రీనివాస్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ బీజేవైఎం అధ్యక్షులుకోసిని వినయ్ యాదవ్ ఉపాధ్యక్షులు బక్క శెట్టి రాజు ఇటికల మహేందర్ సహాయ కార్యదర్శి రెడ్డి మల్ల ఆశీర్వాద్ మహేష్ బలగం భాస్కర్ గౌడ్ నిఖిల్ బాబు అధ్యక్షులు జంగం కిషన్ బుజ్జ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.

ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో  డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు:-

వరంగల్/హనుమకొండ, నేటిధాత్రి(న్యాయ విభాగం):-

 

 

14-04-2025 నాడు ఉమ్మడి బార్ అసోసిషన్ల ఆధ్వర్యంలో డాక్టర్ బి. ర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  జిల్లా  కోర్టు కాంప్లెక్స్ లో గల డాక్టర్ బి. అర్ అంబేద్కర్ భవనంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. 
వరంగల్, హన్మకొండ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు అయిన వలస సుదీర్, పులి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి  పూల మాల వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇరువురు అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు మనకు అందించిన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగంలో కెల్లా అతి పెద్ద రాజ్యాంగం అని అన్నారు. అంబేద్కర్  పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పోరాడార‌ని,  ఆయన గొప్ప మానవతా వాది అని తెలిపారు. న్యాయవాదులు మరియు యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వరంగల్ బార్ అసోియేషన్ వైస్ ప్రెసిడెంట్ జైపాల్, ప్రధాన కార్యదర్శి D.రమాకాంత్, హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, ఇరు బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు,  తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జయాకర్, జనార్ధన్ మరియు  సీనియర్, జూనియర్ న్యాయవాదులు.   మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కేంద్రంలోని కూడలి వద్ద వెనుకబడిన వర్గాల అభ్యున్న తకై అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల బానిస బతుకుల నుంచి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు మన భారత దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలు మరవలేవనని గ్రామస్థాయి నుంచి నేటి యువత మహాత్మజ్యోతి రావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అరికెల దేవయ్య, ముక్కెర ముఖేష్, తుడుం వెంకటేష్, గజ్జి రమేష్ కొమ్ముల తిరుపతి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు, పాపయ్య, ప్రసాద్, ఎమ్మార్పీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు.!

బహుజన సంఘర్షణ సమితి అధ్వర్యం లో జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు…పాల్గొన్న నాయకులు అధికారులు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రం లో జరిగిన మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా మహాత్మా జ్యోతి రావు పూలె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బహుజన, సంఘర్షణ నాయకులు ఈ సందర్బంగా ఝరాసంగం ఎంపిడిఓ సుధాకర్ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతల్ గట్టు శివరాజ్ మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వం వంద ఏబై ఏండ్ల క్రితమే జ్యోతి రావు పూలె బహుజనులకు సామాజిక న్యాయం కోసం స్త్రీ విద్య మరియు సమానత్వం కోసం అగ్రకులాల వారి తో పోరాటం చేసి బహుజన వర్గాల సామాజిక హక్కులు కాపాడిన మహనీయుడు జ్యోతి రావు పూలె అన్నారు. ఆయన ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు బడ్జెట్ కేటాయింపులలో, సామాజిక న్యాయం కోసం బహుజనుల విద్య ఉపాధి అవకాశల కోసం బడ్జెట్ లో అధిక నిధులు కేటాయింపులు చేసి రాజ్యాంగ ఫలాలు, చట్ట బద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చుడాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఎంపీడీఓ సుదాకర్, సమత సైకిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్,మాజీ ఎంపీటీసీ సి. హెచ్ రాజ్‌కుమార్,అడ్వాకేట్ షకీల్, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్, బహుజన నాయకులు జాగృతి అధ్యక్షులు ముదిరాజ్ పాండు, సి హెచ్ దత్తు, కొల్లూర్ గ్రామ అధ్యక్షులు డప్పుర్ సంగమేష్,బోజ్యానాయక్ తండా అధ్యక్షులు సుబాష్,సామాజికవేత్త దన్‌రాజ్ గౌడ్, 24 న్యూస్ మీడియా దిగంబర్,నాయకులు అమృత్, ప్రవీణ్,రవి విద్యాసాగర్,ఉపేందర్ మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మరియు వివిధ పార్టీ నాయకులు,వివిధ సంఘనాయకులు తధితరులు పాల్గోని మహాత్మ జ్యోతి రావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version