ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు. దేవనూరి కుమార్.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ముదిరాజులకు ఇచ్చిన హామీల వెంటనే నెరవేర్చాలని మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ డిమాండ్ చేశారు ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ముదిరాజుల రిజర్వేషన్ మార్చిందని దుయ్యపట్టారు నామినేట్ పదవులను జనాభా ప్రాతిపదికన ముదిరాజులకే ఎక్కువ పదవులు కేటాయించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభాలో ముదిరాజులు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన కులగనన సర్వేలో తేలిందని తెలిపారు