
జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల.
జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల. జహీరాబాద్ నేటి ధాత్రి: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను WWW. bsetelangana. cgg. gov. in సెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ మూడవ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు.