పోతరాజు విగ్రహం ధ్వంసం

పోతరాజు విగ్రహం ధ్వంసం మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామ చెరువుకట్టపై గల పెద్దమ్మతల్లి గుడిలోని పోతరాజు విగ్రహాన్ని బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ముదిరాజ్‌ కులసంఘము నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారినుండి ఫిర్యాదును స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.