గుట్కాల పట్టివేత

గుట్కాల పట్టివేత వరంగల్‌ క్రైమ్‌, నేటిధాత్రి : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంభునిపేట ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 27వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు బుధవారం స్వాదీనం చేసుకున్నామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. శంభునిపేటకు చెందిన ధర్మపురి రమేష్‌ ఇంట్లో తనిఖీ చేయగా గుట్కాలు లభించాయని, రమేష్‌పై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.