kulina prabuthva patashala bavanam, కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం
కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం నుగూరు వెంకటాపురం మండలం నెలారిపేటలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం శనివారం ఉదయం కుప్పకూలింది. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలకోసం నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిలమైన భవనాల్లో పాఠశాల నడపడం ఎప్పటికైనా ప్రమాదమేనని వారు అంటున్నారు.