
-మర్యాదపూర్వకంగా కలిసిన మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 16
మొగుళ్ళపల్లి ఎంపీడీవోగా టి జయశ్రీ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన కృష్ణవేణి వరంగల్ జిల్లా గీసుకొండకు బదిలీ కాగా..కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎంపీడీవోగా పనిచేసిన టి జయశ్రీ మొగుళ్ళపల్లికి ఎంపీడీవోగా బదిలీపై వచ్చి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి..పుష్పగుచ్చం అందించి..శుభాకాంక్షలు తెలిపారు.