రేగొండ, నేతిధాత్రి:
సింజెంటా వారి సెంట్రిగో ప్రాజెక్ట్ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం మండలములోని గుడేపల్లి పల్లి గ్రామంలో సోమవారం జరిగింది.టెర్రిటరీ మేనేజర్ యిట్నేని వెంకటేష్,క్వాలిటీ మేనేజర్ వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయగా జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అవగాహనతో కూడిన నాణ్యమైన ఐపీఎమ్ మిర్చి సాగు చేసే రైతులుగా గుడేప్పల్లి గ్రామ రైతులకు దక్కిందని,అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకైక సెంటర్ గా ప్రాజెక్ట్ ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం పూర్తిస్థాయి దళారీ వ్యవస్థ నిర్మూలించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుందని,దీనివల్ల క్వింటాకు 2000 రైతుకు లాభం జరుగుతుందన్నారు.రైతులకు పంటలో ప్రోత్సాహంగా భూసార పరీక్షలు సైతం ఈ కార్యాలయంలోనే చేస్తారని తెలిపారు.కావున రైతులందరూ ముందుకు వచ్చి మిర్చి అమ్మకాలకు సింజంటా వారి సెంట్రిగో ప్రాజెక్టు వేదికగా చేసుకోవాలని కోరారు. అనంతరం మిర్చి సాగుపై రైతులకు మరింత అవగాహన కల్పించారు.