AV Ranganath Birthday Celebration in Warangal
సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జన్మదిన వేడుకలు
కాశీబుగ్గ మధర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ లో అన్నదానం
నేటిధాత్రి, కాశీబుగ్గ.
హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ జన్మదిన వేడుకలు వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. కాశీబుగ్గకు చెందిన దివ్యాంగుడు సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు 19వ డివిజన్ లోని మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్‌లో జరిగాయి. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారు కమిషనర్ ఏవి రంగనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ అసద్ మాట్లాడుతూ, రంగనాథ్ సార్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు తనకు న్యాయం చేశారని తెలిపాడు. హైడ్రా సంస్థ కార్యకలాపాలు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆ సంస్థ వరంగల్ ట్రై సిటీలో కూడా విస్తరించాలని కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములు, భూకబ్జాలు విస్తృతంగా జరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, సేవా సంస్థ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
