‘‘భూముల చెర’’..’’నిబంధనలు పాతర’’! ఎపిసోడ్‌ – 1

https://epaper.netidhatri.com/view/296/netidhathri-e-paper-18th-june-2024%09

`సర్వే నెంబర్‌‘‘327’’ ‘‘పైకి’’ లో కబ్జా కనిపించడం లేదా?

`గత పాలకులు చేసిన తప్పు సరిదిద్దరా!

`షేక్‌ పేటలో సర్వే నెంబర్‌ 327 పైకి లో దారుణం ఆపరా!

`ప్రభుత్వం ఆ భూమి స్వాధీనం చేసుకోదా!

`ప్లాట్లు చేసి అమాయకులను మోసం చేస్తున్నా అడ్డుకోరా!

`ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ద్వంద్వ వైఖరికి కారణం!

`ముట్టిందెంత పైకం?

`ప్రతిపక్షంలో వున్నప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి భూ ఆక్రమణపై స్పందించారు గుర్తుందా?

`ప్రభుత్వ భూమి పరుల పాలైన సంగతి చూడడం లేదా!

`దర్జాగా భూ దోపిడీ చేసినా పట్టించుకోరా!

`ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం చేసిన వాళ్లను వదిలేస్తారు?

`తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాళ్లను శిక్షించరా!

`ఆక్రమించుకున్న భూమిలో రియల్‌ వ్యాపారం వదిలేస్తారా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అది లెక్క ప్రకారం పక్కగా ప్రభుత్వ భూమి. అయితేనేం రాయించుకునే వారికి, అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాసిచ్చేవారున్నారు. అలా తెలంగాణలో పదేళ్ల కాలంలో ఎంతో విలువైన స్థలాలు రాయించుకొని మాయం చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలు కూడా పూర్తి చేసుకున్నారు. రియల్‌ వ్యాపారం చేస్తూ వేల కోట్లకు పడగలెత్తుతున్నారు. భూ వ్యాపారం మాఫియాగా మార్చేశారు. దర్జాగా బెదిరింపులు చేసి భూములు ఆక్రమించుకునే వాళ్లు లెక్కలేనితనంగా కబ్జాలు చేశారు. మరి కొందరు గత ప్రభుత్వ పెద్దల అండతో అధికారులను బెదిరించి రాయించుకున్నారు. అదేదో సినిమాలో హుస్సేన్‌ సాగర్‌ నాదే, చార్మినార్‌ నాదే అన్నట్లు ప్రభుత్వ పెద్దల చలవతో కనపడిన భూములు రాయించుకున్నవారున్నారు. అలా చేయడం వల్ల అటు స్వామి కార్యం,ఇటు స్వకార్యం రెండూ నెరవేరుతాయి. కొట్టేసిన భూముల్లో ప్రభుత్వ పెద్ద పాత్ర పైకి కనిపించదు. రాయించుకొని వ్యాపారం చేసుకున్న వారు అమ్ముకొని లాభాలు వెనకేసుకుంటారు. తర్వాత కొన్న వాళ్లు ఇబ్బందులకు గురౌతారు. అమ్మే వారికి కొనేవారు లోకువ. ఇంకే ముంది తేరగా వచ్చిన భూమిని పలహారం చేసి అమ్మేసుకుంటారు. సామాన్య ప్రజలకు ఇవ్వడానికి ప్రభుత్వ భూమి లేదని బొంకిన గత పాలకులు అయిన వారికి మాత్రం ఎకరాల కొద్ది రూపాయి ఖర్చు లేకుండా అప్పగించారు. కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నారు. వచ్చిన లాభాలలో వాటాలు పంచుకున్నారు. ప్రభుత్వ భూమిని సొంత భూమిగా మార్చుకొని అమ్ముకుతింటున్నారు. ధరణి తెచ్చాం…అక్రమాలకు చెక్‌ పెడతాం..ప్రభుత్వ భూములు కాపాడతామని చెప్పిన వాళ్లు వెనకుండి నడిపిన భూ భాగోతాలలో ఇదొకటి. సుమారు3 వేల కోట్ల భూమిని మైసూర్‌ పాక్‌ నమిలేసినంత ఈజీగా మింగేశారంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరి భూమి! ఎవరు కాజేస్తున్నారు. ఎందుకు దోచేస్తున్నారు అని అడిగే దిక్కు లేకుండా చేశారు. ప్రభుత్వం తమ చేతుల్లో వుందని ఇష్టానుసారం భూమలు మింగేశారు. అలా మింగిన భూముల్లో ఇది ఒకటి.

ఒకప్పుడు నగరశివారు. ఇప్పుడు నగరంలో అదొక పార్ట్‌. షేక్‌ పేట అంటే భూ వ్యాపారంలో హాట్‌ కేక్‌. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన భూముల చెర ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం ఆగడం లేదు. ఎవరు పాలకులుగా వుంటే వాళ్లు, వాళ్ల అనుయాయులు, అనుచరులు, పార్టీ నేతలు, సన్నిహితులు, స్నేహితులు ఇలా పార్టీ పేరు చెప్పుకొని, ప్రభుత్వ అండ చూసుకొని భూములను మింగేయడం అలవాటు చేసుకున్నారు. వ్యాపారం పేరుతో పైసాకు కూడా పని చేయని వారు కోట్లకు పడగలెత్తారు. అలాంటిదే ఈ ఘటన. షేక్‌ పేటలో కొందరు వ్యక్తులు కలిసి సొసైటీ పేరుతో కొత్త దుకాణం తెరిచారు. సర్వే నెంబర్‌ 327 పైకి మీద కన్నేశారు. దానిని అప్పనంగా మింగేశారు. దానిని ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌ తొలుత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ స్థల ఆక్రమణ అక్రమం అన్నారు. అది ప్రభుత్వ భూమి ఎవరూ ఆక్రమించుకోవడానికి వీలు లేదన్నాడు. అన్యాక్రాంతం కాకుండా అడ్డుకుంటానని, కాపాడతానని శపధం చేశాడు. మొత్తానికి సొసైటీ సభ్యుల మాయలో పడిపోయాడు. వారికి సహకరించాడు. ఓ సందర్భంలో గత ప్రభుత్వంలో అన్నీ తానై నడిపిన కేటిఆర్‌ బస్తీ దవఖాన ప్రారంభించేందుకు షేక్‌ పేటకు వచ్చాడు. ఆ విషయం కొందరు సొసైటీ సభ్యులు చెవిలో వేశారు. మాగంటి గోపీనాథ్‌ తందానా అన్నారు. అప్పటి ఉన్నాధికారికి ఆదేశం వెళ్లింది. ప్రత్యేక జీవో వచ్చింది. వెంటనే జిహెచ్‌ఎంసి కమీషనర్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకేముంది చకచకా ఫైలు కదిలింది. సంబంధిత తహసీల్దారుకు ఫోన్‌ వెళ్లింది. ప్రభుత్వ భూమి కొందరు వ్యక్తులకు దారాదత్తమైంది. ఎవరి వాటాలు వాళ్లు పంచుకున్నారు. అయితే అప్పటి నుంచి స్థానికులు ఆ భూమి ప్రభుత్వానిదని మొత్తుకుంటున్నారు. పిర్యాధుల మీద పిర్యాదులు చేశారు. ఉద్యమాలు చేశారు. పోరాడుతూనే వున్నారు. ఈ విషయం తెలిసిన అప్పటి పిసిసి. అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ స్థల పరిశీలన చేశారు. అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కాలం గిర్రున తిరిగింది. ఆనాడు ఆ భూమిని కాపాడతామని చెప్పిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు. అప్పుడే రెండు వేల కోట్ల భూమి అని అన్నారు. ఇప్పుడు దాని విలువ మరిన్ని రెట్లు పెరిగింది. దాదాపు మూడు వేల కోట్ల భూమి అంటున్నారు. మరి అలాంటి భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నది. పేద ప్రజలకు ఇల్లు నిర్మించేందుకు, ఎన్నికలలో ఇచ్చిన హామీ అమలు చేయడానికి గత ప్రభుత్వం భూములు లేవని చేతులెత్తేసింది. ఇలాంటి భూములను వ్యాపారుల చేతిలో పెట్టింది. ప్రభుత్వ భూములను కాసుల కక్కుర్తికి చీకటి ఒప్పందాలతో అప్పగించింది. దాని వెనుక వున్న వాళ్లెవరో ఈ ప్రభుత్వానికి తెలుసు. అక్కడ ఏం జరిగిందన్నదానిపై ప్రభుత్వానికి పూర్తి సమాచారం వుంది. స్వయంగా రేవంత్‌ రెడ్డి ఆ భూమి ఆక్రమణ అన్యాయం అని చెప్పిన సందర్భం వుంది. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి. ఆధారాలు ఏం కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని ఒత్తిడి, పిసిసి అధ్యక్షుడుగా ఎన్నికల వ్యవహారాలతో ఇంత కాలం బిజీగా వున్న రేవంత్‌ రెడ్డి ఇప్పటికైనా ఈ భూ వ్యవహారం మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో ప్రభుత్వం పేదల కోసం ఇచ్చిన భూములనే రోడ్ల కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అలాంటిది ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, వ్యాపారం చేసుకుంటున్న అక్రమార్కుల మీద ఉక్కు పాదం మోపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల భూమి మిగిలినట్లే అవుతుంది. ఇలాంటి భూములు ఆక్రమించుకొని అమాయకులైన ప్రజలకు అంటగట్టి, వారిని ఇబ్బందుల పాలు చేసే వారికి హెచ్చరిక జారీ చేసినట్లౌతుంది. లేకుంటే ఎక్కడ గుంట జాగా కనిపించినా కబ్జాలు పెట్టేవారు పెరిగిపోతారు. సామాన్యుల భూములు కూడా చెరబట్టడం మొదలుపెడతారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా గిరిజనుల భూములు ఆక్రమించుకొని, ఎన్నికల సందర్భంలో చెప్పు దెబ్బలు తిన్న వాళ్లు కూడా వున్నారు. ఈ ప్రభుత్వం మీద అలాంటి ఆరోపణలు రాకుండా, ప్రజా పాలన గొప్పదనాన్ని చూపించాలని సిఎం. రేవంత్‌ రెడ్డిని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *