Strict Vigil on Illegal Liquor in Rajanna Sircilla District
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ మద్యంపై నిఘా
– ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు
– 98 కేసులలో 1525 లీటర్ల మద్యం సిజ్
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత
సిరిసిల్ల(నేటి ధాత్రి):
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 11 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే అక్రమ మద్యం విక్రయం,రవాణాపై నిఘా ఉంచి ఆకస్మిక దాడులు నిర్వహించి 98 కేసుల్లో 1525 లీటర్ల అక్రమ మద్యంను సీజ్, రూ. 23,28,500/- నగదును సీజ్ చేయడం జరిగిందన్నారు.
ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నవారు,గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారిని 224 కేసుల్లో 782 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు.ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తూ స్వేచ్ఛాయుత, శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.
