సిరిసిల్ల(నేటి ధాత్రి):
కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖ మంత్రిగా బండి సంజయ్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా సిరిసిల్ల బిజెపి నాయకులు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పత్తిపాక సురేష్ ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా బిజెపి నుండి పోటీ చేసి గెలుపొందడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సురేష్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి ఉన్నారు.