*ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అందరి సహకారం అవసరం*
*విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రజాప్రతినిధులు,తల్లిదండ్రులు,పూర్వ విద్యార్థుల సమావేశం*
*పరకాల,నేటిధాత్రి*
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో విద్యా వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ప్రజాప్రతినిధులు,పేరెంట్స్,టీచర్స్,పూర్వ విద్యార్థుల సమావేశం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి పట్టణ వార్డు కౌన్సిలర్లు,సమీప గ్రామాల సర్పంచులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పూర్వ విద్యార్థులు హాజరై కళాశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,అనుభవజ్ఞులైన అధ్యాపకులు,ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఒక వ్యక్తి వద్ద ఉన్న ఆస్తిని దొంగలించవచ్చేమో గానీ విద్యను ఎవరూ దొంగలించలేరని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కళాశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కోరారు.కళాశాల అభివృద్ధికి అధ్యాపక బృందం చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు హాజరైన ప్రజాప్రతినిధులు,తల్లిదండ్రులను ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య,స్టాఫ్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ ఎలిషాల అశోక్,ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ఏ.శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ జి.పావని,కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ జి.రాజేశ్వర్ కుమార్,అధ్యాపకులు డాక్టర్ భీమ్రావు,బి.మహేంద్రరావు,డాక్టర్.ఆడెపు రమేష్,డాక్టర్ కల్పన,డాక్టర్ కే.జగదీష్ బాబు,ఎం.సమ్మయ్య,ఆర్.ఈశ్వరయ్య,ఎస్.రాజశ్రీ,డాక్టర్ డి.సంజయ్ కుమార్,పవన్ తదితరులు పాల్గొన్నారు.
