విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికే సమ్మర్ క్యాంపులు

*విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికే సమ్మర్ క్యాంపులు*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం గీతానగర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తోందన్నారు.

ఈ నెల 17 వరకు జరిగే కార్యక్రమాల్లో నాట్యం, సంగీతం, చిత్రలేఖనం, చేతిరాత, కర్రసాము వంటి శిక్షణలు ఇవ్వనున్నట్లు తెలిపారు.ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు జరిగే ఈ క్యాంపుల్లో ఏ పాఠశాల విద్యార్థులైనా పాల్గొనవచ్చని చెప్పారు. పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని అంకాలపు సిరిని సన్మానించి, విద్యార్థులకు కిట్లు అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version