ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పరామర్శ
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
దళితబందు రెండవ విడత మంజూరు కావడం లేదని అప్పులు బాగా కావడంతో మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన బోడికెలా శ్రీనివాస్ అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ బాధితుణ్ణి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, దళిత బంధు రెండవ విడత వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని. బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టంగుటూరి రాజకుమార్, మోలుగు దిలీప్, మంద రాజేష్, కోలుగూరి నరేష్, రామంచ రాకేష్, బండారి ప్రశాంత్, ప్రసన్న కుమార్, రామంచ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.