
Collector Urges Skill Development in Schools
సబ్జెక్ట్ ల వారీగా సామార్ధ్యo పెంచాలి
ఏ.ఐ ద్వారా విద్యాబోధనకు కృషి చేయాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారి వారి తరగతికి సంబందించిన అన్ని సబ్జెక్ట్ ల సామర్థ్యాలు సాధించేలా విద్యా బోధన అందించాలని,విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లా కలెక్టర్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలల్లో నాణ్యమైన విద్య అందించాలని సంబంధిత ఎంఈఓ లకు ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాల విద్య అభివృద్ధికి ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపిలో భాగంగా బేస్ లైన్ ఫలితాలు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో ఆన్ లైన్ చేయాలని ఎఫ్ఏ-1 మార్కులను కూడా సిసిఇ వెబ్ పోర్టల్ లో వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు.
హరితహారంలో భాగంగా విద్యాశాఖ టార్గెట్లు 100 శాతం పూర్తి చేసి విద్యార్థులతో మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ప్రతి స్కూల్లో ముల్లాపొదలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి స్కూళ్లలో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు మునగా,నిమ్మ,దానిమ్మ, ఉసిరి,గోరింటాకు,కరివేపా తదితర మొక్కలను నాటాలని..నాటిన ప్రతి మొక్కని ఎకో క్లబ్ మిషన్ లైఫ్ వెబ్ పోర్టల్ లో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.కంప్యూటర్స్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధన అందించుటకు తెలుగు,ఇంగ్లీష్,మాథ్స్ నైపుణ్యలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.విద్యార్థుల,ఉపాధ్యాయులు అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా 100 శాతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు,యు,సృజన్ తేజ,ఏఎంఓ, ఎంఈఓలు సెక్టోరియల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.