
ఎస్సై జె రమేష్ .
చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన కొంక హరిబాబును చిట్యాల ఎస్సై జి రమేష్ అభినందించారు, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని క్రీడల పట్ల ఆసక్తి చూపాలని అన్నారు క్రీడల వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు, అలాగే విద్యార్థులుకు క్రీడ వసతులు కల్పించి అండగా ఉంటాం. అని చిట్యాల సర్పంచ్ పూర్ణచంద ర్ అన్నారుచిట్యాల మండల వాలీబాల్ టీమ్ కు ఎంపికైన విద్యార్థులకు
మండలం లోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన కొంకా హరి బాబూ గారు క్రీడ దుస్తులను అందించారు..
క్రీడ దుస్తులను మండల ఎస్సై రమేష్ మరియు ఎంఇఓ,సర్పంచ్ గార్లతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని క్రీడల్లో రాణించిన వారికి స్పోర్ట్స్ కోటాలో మంచి అవకాశాలు ఉన్నాయని క్రీడలు శారీరకంగా మానసికంగా ఉండడం కోసం దోహదా పడతాయని మరియు క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అరు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడ కారులు మహేష్ ,రాజు కుమార్,ఉపాద్యాయులు బుర్ర సదయ్య , రాజమౌళి, పిఈటి సమ్మయ్య ,మరియు క్రీడాకారులు పాల్గొన్నారు